Virat Kohli: కోహ్లీ నామస్మరణతో మార్మోగుతోన్న కోల్‌కతా.. 70 వేలమాస్కుల పంపిణీ.. స్టేడియమంతా విరాట్ కోహ్లీలే ఇక
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ రోజే టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. దీంతో మ్యాచ్ జరిగే కోల్‌కతా నగరంలో కింగ్ కోహ్లీ పేరు మార్మోగుతోంది. మరో వైపు కోహ్లీ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు క్యాబ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చే ప్రతి ఒక్కరికీ విరాట్ కోహ్లీ ఫేస్ మాస్కులు ఇచ్చేలా ప్లాన్ చేశారు.

ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆదివారం (నవంబర్ 5)న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్ల మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) సన్నాహాలు ప్రారంభించింది. ఇక భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ రోజే టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. దీంతో మ్యాచ్ జరిగే కోల్‌కతా నగరంలో కింగ్ కోహ్లీ పేరు మార్మోగుతోంది. మరో వైపు కోహ్లీ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు క్యాబ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చే ప్రతి ఒక్కరికీ విరాట్ కోహ్లీ ఫేస్ మాస్కులు ఇచ్చేలా ప్లాన్ చేశారు. అలా సుమారు 70,000 కోహ్లీ ఫేస్ మాస్క్‌లను పంపిణీ చేయాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో స్టేడియం మొత్తం కోహ్లీతో నిండిపోతుంది. ‘స్టేడియంలోని ప్రతి క్రికెట్ అభిమాని కోహ్లీ మాస్క్‌లు ధరించాలని కోరుకుంటున్నాం. ఆ రోజు సుమారు 70,000 మాస్క్‌లను పంపిణీ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం’ అని CAB ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహశిష్ గంగూలీ చెప్పారు.
ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు, బర్త్ డే కేక్ కటింగ్ ఈవెంట్ కూడా జరగనుంది. ఈ సందర్భంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ విరాట్ కోహ్లీకి జ్ఞాపికను ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. అలాగే ఇన్నింగ్స్ విరామ సమయంలో విరాట్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ భారీగా టపాసలు కాల్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తానికి, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో విరాట్ కోహ్లీకి 35 ఏళ్లు నిండిన సందర్భంగా అతని పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి CAB ఒక గ్రాండ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. దీని ప్రకారం నవంబర్ 5న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సర్వం కోహ్లీ మయం అవుతుందనడంలో సందేహం లేదు.
టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్ ల షెడ్యూల్
- నవంబర్ 2: భారత్ vs శ్రీలంక (ముంబై)
- నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా (కోల్‌కతా)
- నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ (బెంగళూరు)
భార్య అనుష్కా శర్మతో విరాట్ కోహ్లీ..
View this post on Instagram
విరాట్ కోహ్లీ బర్త్ డే వేడుకలకు గ్రాండ్ గా ఏర్పాట్లు..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








