ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనే 8 జట్లు ఇవే.. తొలిసారి ఎంట్రీ ఇచ్చిన ఆ టీం ఏదంటే?
ICC Champions Trophy 2025: వన్డే ప్రపంచ కప్ లీగ్ రౌండ్ తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 8 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ముందుగా తెలిపింది. దీని ప్రకారం, ఇప్పుడు వన్డే ప్రపంచ కప్ లీగ్ రౌండ్ ముగిసింది. పాయింట్ల పట్టిక జాబితాలో టాప్ 8 జట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏజట్లు అర్హత సాధించాయో చూద్దాం..
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 (ICC ODI World Cup 2023) లీగ్ దశ ఇప్పుడు ముగిసింది. ప్రపంచ కప్ 2023 లీగ్ దశలో భారత్, నెదర్లాండ్స్ (India Vs Netherlands) జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 160 పరుగుల తేడాతో డచ్ జట్టును ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ సేనకు ప్రపంచకప్‌లో ఇది వరుసగా 9వ విజయంగా మారింది. అయితే.. భారత్‌ను ఓడించి 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025 ICC Champions Trophy)లో చోటు దక్కించుకోవాలనే తపనతో ఉన్న నెదర్లాండ్స్ జట్టు నిరాశను ఎదుర్కొన్నారు. కాగా, ఈ ప్రపంచకప్‌లో లీగ్ రౌండ్ ముగిసిపోవడంతో బుధవారం నుంచి సెమీఫైనల్ రౌండ్ ప్రారంభం కానుంది. లీగ్ రౌండ్ ముగింపుతో, 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన 8 జట్ల జాబితా కూడా సిద్ధమైంది.
టాప్ 8 జట్లకు ప్రాధాన్యత..
నిజానికి 2025లో జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ 8 జట్ల మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో ఆడే 8 జట్లు ఈ ఏడాది ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాయి. ప్రపంచకప్ లీగ్ రౌండ్ తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 8లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ అంతకుముందు తెలిపింది. దీని ప్రకారం, ఇప్పుడు ODI ప్రపంచ కప్ లీగ్ రౌండ్ ముగిసింది. పాయింట్ల జాబితాలో టాప్ 8 జట్లను ఓసారి పరిశీలిద్దాం.
2025లో జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 దేశాలు..
1. భారతదేశం
2. దక్షిణ ఆఫ్రికా
3. ఆస్ట్రేలియా
4. న్యూజిలాండ్
5. పాకిస్తాన్
6. ఆఫ్ఘనిస్తాన్
7. ఇంగ్లండ్
8. బంగ్లాదేశ్
పాకిస్థాన్ ఆతిథ్యంలో..
View this post on Instagram
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుంది. తద్వారా ఆతిథ్య దేశం కావడంతో పాకిస్థాన్ ఆతిథ్య దేశంగా అర్హత సాధించింది. పాకిస్థాన్‌తో పాటు ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలే స్టేజ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఆందోళన చెందింది. కానీ, గత రెండు మ్యాచ్‌లలో, ఇంగ్లండ్ మంచి పునరాగమనం చేసింది. రెండు మ్యాచ్‌లలో గెలిచి దిగువ నుంచి 7వ స్థానానికి చేరుకుంది.
చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్‌లో నిర్వహించారు. ఆ ఎడిషన్‌లో అంటే 2017లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగలేదు. 8 ఏళ్ల తర్వాత ఈ మెగా ICC టోర్నీకి 2025లో పాకిస్థాన్‌లో ఆతిథ్యం ఇవ్వనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..