చరిత్ర సృష్టించిన టీమిండియా.. దెబ్బకు రికార్డులన్నీ చెల్లాచెదురే.. ఈ 5 టీమిండియా ప్లేయర్స్..!

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో..టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా సెమీస్‌కు చేరింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయమే కాదు..పలు రికార్డులను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు..టీమిండియా ప్లేయర్స్‌..

చరిత్ర సృష్టించిన టీమిండియా.. దెబ్బకు రికార్డులన్నీ చెల్లాచెదురే.. ఈ 5 టీమిండియా ప్లేయర్స్..!
Team India
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 13, 2023 | 8:56 AM

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో..టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా సెమీస్‌కు చేరింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయమే కాదు..పలు రికార్డులను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు..టీమిండియా ప్లేయర్స్‌..

వరల్డ్‌కప్‌ లీగ్‌ దశను అజేయంగా ముగించింది..టీమ్‌ఇండియా. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 160 పరుగుల భారీ తేడాతో ఘన విజయ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆలౌట్‌ అయింది.

భారీ విజయమే కాదు..పలు రికార్డ్‌లకు కూడా వేదికయింది ఈ మ్యాచ్‌. ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు 15 వికెట్లు సాధించిన అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ పేరిట ఉండేంది. ఇక ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లోనే సెంచరీ సాధించిన రాహుల్‌.. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలోనే భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్‌కు ముందు ఈ రికార్డు రోహిత్‌ శర్మ పేరిట ఉండేది. ఓపెనర్ రోహిత్ శర్మ దగ్గర నుంచి ఐదో బ్యాటర్ కేఎల్ రాహుల్ దాకా.. ప్రతిఒక్కరూ 50కి పైగా వ్యక్తిగత పరుగులు చేశారు. టీమిండియాలోని టాప్-5 బ్యాటర్లు 50కి పైగా స్కోర్‌లు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ విషయంలోనే భారత ఆల్‌టైం రికార్డ్‌ని తన పేరిట లిఖించుకుంది. దీంతోపాటు వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ఇది సెకండ్‌ హయ్యస్ట్‌ స్కోరు. 2007లో బెర్ముడాపై 413 పరుగుల స్కోర్‌ సాధించింది టీమిండియా. ఇదే మ్యాచ్‌లో టీమిండియా సారధి రోహిత్‌శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 14 వేల పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గానూ రోహిత్ రికార్డు సృష్టించాడు. అటు కోహ్లీ కూడా ఈ వన్డే వరల్డ్ కప్ లీగ్ స్టేజిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏటంటే..టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలర్లు ఉపయోగించాడు. భారత జట్టులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బౌలింగ్ వేయడమే కాదు.. చెరో వికెట్ కూడా తీసుకున్నారు.మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. శ్రేయస్ అయ్యర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్‌ని గెలుపొందాడు. ఈ నెల 15న ముంబయిలోని వాంఖడే వేదికగా టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్ తో తలపడనుంది. గత వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లోనే ఓడింది. అప్పుడు కూడా న్యూజిలాండే ప్రత్యర్థి. ఈ నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే చాన్స్ టీమిండియా ముందు నిలిచింది.