AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025: ట్రోఫీకి ముందు హైప్ ఎక్కిస్తున్న ICC! అదరగొడుతున్న అఫీషియల్ సాంగ్..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అతిఫ్ అస్లాం పాడిన అధికారిక గీతం "జీతో బాజీ ఖేల్ కే" విడుదలైంది. ఈ పాట పాకిస్తాన్-UAEలో జరగనున్న మెగా టోర్నమెంట్‌కు మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. అతిఫ్ అస్లాం క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి ఉందని, ఈ గీతంలో భాగం కావడం గర్వంగా ఉందని చెప్పారు. ఈ పాటతో స్టేడియంలలో ప్రేక్షకుల సందడి మరింత పెరుగుతుందని PCB, ICC ప్రతినిధులు తెలిపారు.

Champions Trophy 2025: ట్రోఫీకి ముందు హైప్ ఎక్కిస్తున్న ICC! అదరగొడుతున్న అఫీషియల్ సాంగ్..
Icc Champions Trophy
Narsimha
|

Updated on: Feb 07, 2025 | 4:28 PM

Share

ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు మరింత ఉత్సాహం తీసుకురావడానికి ప్రఖ్యాత గాయకుడు అతిఫ్ అస్లాం పాడిన అధికారిక గీతం “జీతో బాజీ ఖేల్ కే” విడుదలైంది. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు పాకిస్తాన్ & UAE లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైన వేళ, ఈ పాట అభిమానులను మరింత ఉత్తేజానికి గురి చేస్తోంది.

ఈ గీతాన్ని అబ్దుల్లా సిద్ధిఖీ సంగీతం అందించగా, అద్నాన్ ధూల్ & అస్ఫాండ్యార్ అసద్ లిరిక్స్ రాశారు. మ్యూజిక్ వీడియోలో పాకిస్తాన్ వీధులు, మార్కెట్లు, స్టేడియంలు వంటి విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే విధంగా రూపొందించబడింది. ఆటపట్ల ఉన్న ప్రేమ, ఉల్లాసాన్ని ఈ వీడియో గొప్పగా ప్రదర్శిస్తుంది. ఈ పాటను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ స్ట్రీమింగ్ ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉంచారు.

ఈ అవకాశంపై అతిఫ్ అస్లాం మాట్లాడుతూ, “నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఫాస్ట్ బౌలర్ అవ్వాలని అనుకున్నాను. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ అధికారిక గీతంలో భాగమవ్వడం నాకు గౌరవంగా ఉంది. ముఖ్యంగా ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ చూడడం నాకు ఎంతో ఇష్టం. అది ఎప్పుడూ భావోద్వేగాల కలయిక. ఈ పాట ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని నమ్ముతున్నాను” అని అన్నాడు.

ఈ పాట విడుదల సందర్భంగా ICC చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనురాగ్ దహియా మాట్లాడుతూ, “ఈవెంట్‌కు ముందు అభిమానుల ఉత్సాహం పెరుగుతోంది. అధికారిక పాట ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ప్రత్యేకతను చాటుతుంది. టిక్కెట్లను అభిమానులు త్వరగా బుక్ చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నాం” అని తెలిపారు.

ఈ పాట విడుదలతో, ఛాంపియన్స్ ట్రోఫీకి మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాం అని, అతిఫ్ అస్లాం గతంలో PSL కోసం అద్భుతమైన గీతాలను అందించాడు, ఈ పాట స్టేడియంలలో అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని ఎలాంటి సందేహం లేదు అని PCB చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్ అన్నారు.

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ ప్రేమికులకు ఈ పాట మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అభిమానుల మధ్య గొప్ప ఉత్కంఠను తీసుకురానుంది. స్టేడియంలలో ప్రేక్షకుల సందడి, ఈ గీతంతో మరింత ఆహ్లాదంగా మారనుంది!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..