AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్ బాగా టర్న్‌ అవుతుందనే కొంటె సాకులు చెప్పొద్దు.. అవన్నీ పనికిమాలిన మాటలు.. హాట్ కామెంట్స్ చేసిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్

Graeme Swann Coments : ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు టీమ్‌ఇండియా పేస్‌ పిచ్‌లపై ఫిర్యాదులు చేయదని.. అలాంటప్పుడు స్పిన్‌ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని

పిచ్ బాగా టర్న్‌ అవుతుందనే కొంటె సాకులు చెప్పొద్దు.. అవన్నీ పనికిమాలిన మాటలు.. హాట్ కామెంట్స్ చేసిన ఇంగ్లాండ్  మాజీ స్పిన్నర్
uppula Raju
|

Updated on: Feb 27, 2021 | 5:16 AM

Share

Graeme Swann Coments : ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు టీమ్‌ఇండియా పేస్‌ పిచ్‌లపై ఫిర్యాదులు చేయదని.. అలాంటప్పుడు స్పిన్‌ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లాండ్‌ జట్టును కాకుండా పిచ్‌ను విమర్శించడం ఏమిటని ఆ జట్టు మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అన్నాడు. మొతేరా స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా గురువారం 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌ కేవలం రెండు రోజుల్లోనే పూర్తవ్వడంపై పలువురు క్రికెటర్లు పిచ్‌ తీరును విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన స్వాన్‌.. టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు ఇలాంటి ఫిర్యాదులు చేయదని చెప్పాడు.

‘ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కూడా ఒకింత బాగానే ఆడింది. అయితే, కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసింది. వచ్చేవారం జరగబోయే నాలుగో టెస్టుకు కూడా ఇలాంటి పిచ్చే ఉంటుంది. అందులో వేరే ఉద్దేశమే లేదు. ఇంగ్లాండ్‌ మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. మూడో టెస్టులాగే మళ్లీ తప్పులు చేయొద్దు. పిచ్‌ బాగా టర్న్‌ అవుతుందనే కొంటె సాకులు చెప్పొద్దు. అవన్నీ పనికిమాలిన మాటలు. ఇంగ్లాండ్‌ ఇంకా జాగ్రత్తగా ఆడాలి. అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే మరింత కష్టపడాలి. కోహ్లీ ఇలాగే చేశాడు. అండర్సన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి శక్తిమేరా శ్రమించాడు’ అని స్వాన్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

ఇక ఈ విజయంతో టీమ్‌ఇండియా సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్యా నాలుగో టెస్టు జరగనుంది. భారత్‌ ఇది గెలిస్తే సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. చివరి టెస్టు మ్యాచ్‌లో ఒకవేళ భారత్ ఓడిపోతే.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలబడనుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌ను (2-1, 3-1, 2-0 లేదా 4-0) భారత్ గెలుచుకుంటేనే ఫైనల్‌కు చేరుతుంది. మొదటి టెస్టులో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. మిగిలిన రెండు టెస్టుల్లోనూ అద్భుత విజయాలను అందుకోవడం విశేషం. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో తలపడే ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా చేరుకోవాలంటే.. టీమిండియా మార్చి 4న అహ్మదాబాద్‌లో జరగబోయే చివరి మ్యాచ్‌ డ్రాగా ముగించాలి. లేదా గెలిచి తీరాలి.

ఇండియన్ క్రికెటర్ మాజీ భార్యకు వేధింపులు.. పర్సనల్ ఫొటోలు నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపు..

Follow Us
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్