ఇండియన్ క్రికెటర్ మాజీ భార్యకు వేధింపులు.. పర్సనల్ ఫొటోలు నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపు..

ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. పదే పదే తనకు ఫోన్ చేస్తూ ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇండియన్ క్రికెటర్ మాజీ భార్యకు వేధింపులు.. పర్సనల్ ఫొటోలు నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపు..
Follow us
uppula Raju

|

Updated on: Nov 26, 2020 | 2:27 PM

ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. పదే పదే తనకు ఫోన్ చేస్తూ ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

షమీ నుంచి విడిపోయి కూతురుతో వేరుగా ఉంటున్న హసీన్ జహాన్‌ను ఇటీవల ఓ వ్యక్తి తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ వేధించసాగాడు. ఫోన్ ఎత్తిన ప్రతీసారి ఆమెను బండబూతులు తిట్టేవాడు. అంతేకాకుండా ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు లేదంటే తన పర్సనల్ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు. కొన్ని రోజులు లైట్ తీసుకున్న హసీన్ ఇక భరించలేక పోలీసుల సాయం కోరింది. దీంతో పోలీసులు ఫోన్‌కాల్స్‌ ట్రేస్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు కోల్‌కతాకు చెందిన 25 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. అయితే ఎందుకు అలా చేశాడో కారణాలు మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే హసీన్ జహాన్ రెండేళ్ల క్రితం భర్త షమీపై గ‌ృహ హింస కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు అతడు అమ్మాయిలతో తిరుగుతాడని, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాడని మీడియా ముందు వెల్లడించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వారిద్దరు విడిపోయి వేరుగా ఉంటున్నారు.