Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs MI: తెలుగోడి కిర్రాక్ ఇన్నింగ్స్.. 46 బంతుల్లోనే 84 రన్స్‌తో చెలరేగిన ఎలక్ట్రీషియన్ తనయుడు

9 ఓవర్లలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన తిలక్‌ ఆరంభంలో వికెట్‌ను కాపాడుకుంటూ నిలకడగా ఆడాడు. నేహల్‌ వదేరా (13 బంతుల్లో 21) కలిసి ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. ఆతర్వాత వదేరా ఔటైనా తిలక్‌ దూకుడు కొనసాగించాడు. సహచరులు ఒక్కొక్కరు వెనదిరుగుతున్నా..

RCB vs MI: తెలుగోడి కిర్రాక్ ఇన్నింగ్స్.. 46 బంతుల్లోనే 84 రన్స్‌తో చెలరేగిన ఎలక్ట్రీషియన్ తనయుడు
Tilak Verma
Follow us
Basha Shek

|

Updated on: Apr 02, 2023 | 10:28 PM

తెలుగబ్బాయి తిలక్‌ వర్మ మరోసారి అదరగొట్టాడు. గతేడాది ఫామ్‌ను కొనసాగిస్తూ ఐపీఎల్‌ 16 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో చెలరేగాడీ ముంబై బ్యాటర్‌. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే 84 పరుగుల చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సునామీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 9 ఓవర్లలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన తిలక్‌ ఆరంభంలో వికెట్‌ను కాపాడుకుంటూ నిలకడగా ఆడాడు. నేహల్‌ వదేరా (13 బంతుల్లో 21) కలిసి ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. ఆతర్వాత వదేరా ఔటైనా తిలక్‌ దూకుడు కొనసాగించాడు. సహచరులు ఒక్కొక్కరు వెనదిరుగుతున్నా ఒంటరి పోరాటం కొనసాగించాడు. ఇక చివరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హర్షల్‌ పటేల్‌, ఆకాశ్‌ దీప్‌లను లక్ష్యంగా చేసుకుని బౌండరీల వర్షం కురిపించాడు. 17.1 ఓవర్లలో 7 వికెట్‌ కోల్పోయినప్పుడు ముంబై స్కోరు 123 పరుగులే. ఈ పరిస్థితలో జట్టు స్కోరు 150 పరుగులు దాటడం కష్టమేననిపించింది. అయితే అర్షద్‌ ఖాన్‌ ( 9 బంతుల్లో 15) సహాయంతో జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు తిలక్‌. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు శుభారంభం దక్కలేదు. రోహిత్‌ (1), ఇషాన్‌ (10), కామెరున్‌ (5), సూర్య (15) వరుసగా విఫలమయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్‌ టిమ్‌ డేవిడ్‌(4) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.

ఇక బెంగళూరు బౌలర్లలో కర్ణ్‌ శర్మ 2 వికెట్లు తీయగా.. సిరాజ్‌, టోప్లే, ఆకాశ్‌ దీప్‌, హర్షల్‌ పటేల్‌, బ్రాస్‌వెల్ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా తిలక్ వర్మ హైదరాబాద్ రంజీ ఆటగాడు. అతని తండ్రి ఓ ఎలక్ట్రీషియన్. ఆరంభంలో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు తిలక్. కుమారుడిలోని ట్యాలెంట్ ను చూసి తండ్రి కూడా ప్రోత్సహించాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అకాడమీలో చేర్పించాడు. ఐపీఎల్‌లో గత సీజన్ లోనూ ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించి అద్భుతంగా ఆడాడు తిలక్. గత సీజన్‌లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 397 పరుగులు చేశాడు, ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.  అందుకే ముంబై పట్టు బట్టి మరీ రిటైన్‌ చేసుకుందీ తెలుగు తేజాన్ని. ఆ నమ్మాకాన్ని నిలబెడుతూ ఆరంభ మ్యాచ్లోనే చెలరేగాడు తిలక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..