AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ధోనీకి బీసీసీఐ నుంచి భారీగా పెన్షన్.. ఆ డబ్బునంతా ఏం చేస్తాడో తెలుసా?

MS Dhoni BCCI Pension: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే, వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ స్టార్ క్రికెటర్‌కు కూడా బీసీసీఐ నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుందని మీకు తెలుసా? ఆటగాళ్లు పదవీ విరమణ పొందిన తర్వాత వారి సేవలను గుర్తిస్తూ బీసీసీఐ ఇచ్చే ఈ ఆర్థిక భరోసా గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

MS Dhoni: ధోనీకి బీసీసీఐ నుంచి భారీగా పెన్షన్.. ఆ డబ్బునంతా ఏం చేస్తాడో తెలుసా?
Ms Dhoni Bcci Pension
Venkata Chari
|

Updated on: Jan 05, 2026 | 11:07 AM

Share

MS Dhoni: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. కేవలం ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లకు మాత్రమే కాకుండా, గతంలో దేశం కోసం ఆడిన మాజీ క్రికెటర్లకు కూడా బీసీసీఐ అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగా ‘రిటైర్డ్ ప్లేయర్స్ పెన్షన్ స్కీమ్’ ద్వారా మాజీ ఆటగాళ్లకు నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ ఎంఎస్ ధోని పెన్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ధోనీకి ఎంత పెన్షన్ వస్తుంది..?

బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఒక ఆటగాడు ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు అత్యున్నత పెన్షన్ కేటగిరీ కిందకు వస్తారు. ఈ లెక్కన మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ ప్రతి నెలా రూ. 70,000 పెన్షన్‌గా చెల్లిస్తోంది.

పెన్షన్ పెంపు, కేటగిరీలు:

2022లో బీసీసీఐ తన పెన్షన్ పథకంలో కీలక మార్పులు చేసింది. అప్పటివరకు నెలకు రూ. 50,000 ఉన్న గరిష్ట పెన్షన్ మొత్తాన్ని రూ. 70,000కు పెంచింది.

ఇవి కూడా చదవండి

రూ. 70,000: 25 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన మాజీ క్రికెటర్లు (ధోనీ, సచిన్, గవాస్కర్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు).

రూ. 60,000: మరికొంతమంది మాజీ టెస్ట్ ప్లేయర్లు.

రూ. 30,000: ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మాజీ ఆటగాళ్లు.

ఆర్థికంగా స్థిరంగా ఉన్నా పెన్షన్ ఎందుకు?

ఎంఎస్ ధోనీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 1000 కోట్లకు పైగానే ఉంటుంది. అయినప్పటికీ, బీసీసీఐ ఇచ్చే పెన్షన్ అనేది కేవలం ఆర్థిక అవసరం కోసం మాత్రమే కాకుండా, దేశం కోసం వారు చేసిన సేవలకు ఇచ్చే ఒక గౌరవంగా భావిస్తారు. కేవలం ధోనీ మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు కూడా ఈ పెన్షన్‌ను అందుకుంటున్నారు.

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వినోద్ కాంబ్లీ వంటి మాజీ క్రికెటర్లకు బీసీసీఐ ఇచ్చే ఈ పెన్షన్ పెద్ద ఊరటనిస్తోంది. ధోనీ ఈ పెన్షన్ మొత్తాన్ని పలు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా