AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duke Ball : డ్యూక్ బంతి ధర, బరువు ఎంత ? ఇంగ్లాండ్‌లో మాత్రమే వాడుతారా?

ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో డ్యూక్ బంతిని ఉపయోగిస్తున్నారు. ఇది ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ దేశాలలో టెస్ట్ మ్యాచ్‌లలో ఉపయోగిస్తారు. ఇటీవల ఈ బంతి నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులు వచ్చాయి.

Duke Ball : డ్యూక్ బంతి ధర, బరువు ఎంత ? ఇంగ్లాండ్‌లో మాత్రమే వాడుతారా?
Duke Ball
Rakesh
|

Updated on: Jul 19, 2025 | 9:01 AM

Share

Duke Ball : ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో డ్యూక్ బంతిని ఉపయోగిస్తున్నారు. ఈ బంతి ఇటీవల చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే రెండు జట్లు కూడా ఈ బంతి త్వరగా పాడవుతుందని ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ బంతిని తయారు చేసే కంపెనీ దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ డ్యూక్ బంతిని ఇంగ్లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ఉపయోగిస్తారు.ఇది చాలా ఖరీదైనది. అంతర్జాతీయ క్రికెట్ బంతి బరువు నియమాల ప్రకారం నిర్ణయించబడుతుంది. డ్యూక్ బంతి బరువు 155 గ్రాముల నుండి 163 గ్రాముల వరకు ఉంటుంది. బంతి పరిమాణం, బరువు ఐసీసీ నియమాలకు అనుగుణంగా ఉంటాయి.

నివేదికల ప్రకారం.. ఈ బంతి కోసం తోలును స్కాట్లాండ్ నుండి దిగుమతి చేసుకుంటారు. తోలు మందం 4 మిల్లీమీటర్ల నుండి 4.5 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. డ్యూక్ బంతిని బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ కంపెనీ తయారు చేస్తుంది. ఒక బంతిని తయారు చేయడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఈ బంతి ధర 10 వేల నుండి 15 వేల రూపాయల మధ్య ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా రకాల బంతులను ఉపయోగిస్తారు. వాటిలో డ్యూక్ బంతి ఒకటి. టెస్ట్ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్‌లో ఈ బంతిని ఉపయోగిస్తారు. ఇంగ్లాండ్‌తో పాటు మరో రెండు దేశాల్లో కూడా డ్యూక్ బంతిని ఉపయోగిస్తారు. వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు కూడా టెస్ట్ మ్యాచ్‌లను డ్యూక్ బంతితో ఆడతాయి.

డ్యూక్ బంతి కుట్టును యంత్రంతో కాకుండా చేతులతో వేస్తారు. డ్యూక్ బంతి సీమ్ చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ బంతి ఎక్కువ కాలం గట్టిగా ఉంటుంది, దాని ఆకారం త్వరగా మారదు. దీనివల్ల ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ సహాయం లభిస్తుంది. అయితే, దీనికి బౌలర్ నైపుణ్యం కూడా చాలా ముఖ్యం. డ్యూక్ బంతి దాని స్పెషల్ గా తయారు చేసే పద్ధతి, క్వాలిటీ వల్ల చాలా ఖరీదుగా ఉంటుంది. టెస్ట్ క్రికెట్‌లో దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ బంతి వల్ల ఫాస్ట్ బౌలర్లు మంచి ప్రదర్శన చేయగలరు. అయితే, ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి, బంతి క్వాలిటీని మరింత మెరుగుపరచనున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..