T20 World Cup 2024: పాక్‌పై గెలిచినా ఘోర తప్పిదం చేసిన టీమిండియా.. దెబ్బకు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఔట్‌!

|

Oct 07, 2024 | 1:30 PM

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 58 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో నెట్ రన్ రేట్ -2.90తో చివరి స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసినప్పటికీ, నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచడంలో భారత జట్టు విఫలమైంది. దీని కారణంగా, భారత జట్టు ఇప్పుడు..

T20 World Cup 2024: పాక్‌పై గెలిచినా ఘోర తప్పిదం చేసిన టీమిండియా.. దెబ్బకు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఔట్‌!
Team India
Follow us on

మహిళల టీ20 ప్రపంచకప్‌ 7వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు ఘన విజయం సాధించి విజయాల ఖాతా తెరిచింది. అయితే పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్ రేట్ మైనస్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 58 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో నెట్ రన్ రేట్ -2.90తో చివరి స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసినప్పటికీ, నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచడంలో భారత జట్టు విఫలమైంది. దీని కారణంగా, భారత జట్టు ఇప్పుడు నెట్ రన్ రేట్ -1.217తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్ జట్టు నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 11 ఓవర్లలో ఛేదిస్తే +0.084 నెట్ రన్ రేట్ వచ్చేది. కానీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం భారత్‌కు శాపంగా మారింది. ఎందుకంటే టీమిండియాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మంచి నెట్ రన్ రేట్ తో ఈ 2 మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా గెలవాలి. ఒకవేళ కష్టపడి రెండు మ్యాచుల్లో గెలిచినా సెమీఫైనల్‌కు వెళ్లడం అనుమానమే. ఎందుకంటే గ్రూప్-ఎలోని ఇతర జట్లు మెరుగైన నెట్ రన్ రేట్‌ను కలిగి ఉన్నాయి.

ఇక్కడ న్యూజిలాండ్ (+2.900), ఆస్ట్రేలియా (+1.908), పాకిస్థాన్ (+0.555) జట్లు నెట్ నెట్ రన్ రేట్‌ను కలిగి ఉన్నాయి, ఈ జట్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదుపరి మూడు మ్యాచ్‌లలో రెండు గెలిస్తే 6 పాయింట్లు పొందుతాయి. దీని ద్వారా మంచి నెట్ రన్ రేట్‌తో సెమీఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.అంటే టీమిండియా శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ భారీగా పెంచుకోవాల్సి ఉంది. లేకపోతే సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

 

ఈ క్రంలో అక్టోబర్ 9న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి నెట్ రన్ రేట్ సాధించడం తప్పనిసరి. భారత జట్టు తమ చివరి మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుండగా, సెమీఫైనల్‌కు అర్హత సాధించేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి బుధవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో టీమిండియాకు భారీ విజయం అనివార్యం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..