T20 Cricket: న్యూజిలాండ్‌పై చారిత్రాత్మక విజయం.. అంతర్జాతీయ క్రికెట్‌లో యూఏఈ సరికొత్త చరిత్ర..
UAE vs New Zealand: 143 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించిన యూఏఈ జట్టుకు ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించడం ఇదే తొలిసారి. అది కూడా 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో యూఏఈ క్రికెట్ జట్టు కొత్త అధ్యాయానికి తెరతీసింది.

UAE vs New Zealand: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో యూఏఈ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు టాస్ గెలిచి కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిదానంగా ఆరంభించింది. ఓపెనర్ చాడ్ వావ్స్ 21 పరుగులు చేయగా, టిమ్ సీఫెర్ట్ 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మూడో స్థానంలో వచ్చిన మిచెల్ సాంట్నర్ 1 పరుగు మాత్రమే చేసి వికెట్ తీశాడు. దీని తర్వాత క్లీవర్ సున్నాకి అవుటయ్యాడు. మెకంజీ ఇన్నింగ్స్ కేవలం 9 పరుగులకే పరిమితమైంది.
65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ జట్టుకు మార్క్ చాప్ మన్ ఆసరాగా నిలిచాడు. భీకర బ్యాటింగ్‌ను ప్రదర్శించిన చాప్‌మన్ 46 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 63 పరుగులు చేశాడు.




సంచలన విజయం..
WHAT A WIN! 🔥
UAE beat New Zealand by seven wickets to level the series in stunning fashion 🙌#UAEvNZ 📝: https://t.co/IFbq94Tfhb pic.twitter.com/yId7QP86b6
— ICC (@ICC) August 19, 2023
మార్క్ చాప్‌మన్ అర్ధ సెంచరీతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
143 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన యూఏఈ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఆర్యన్ష్ శర్మ (0)ను టిమ్ సౌథీ తొలి ఓవర్ లోనే అవుట్ చేశాడు. అయితే మరోవైపు కెప్టెన్ మహ్మద్ వసీమ్ అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు.
న్యూజిలాండ్ పరేషాన్..
Congratulations to the UAE. What a performance against New Zealand tonight. This moment ❤️ #UAEvNZ pic.twitter.com/oIUJaVRFqI
— Farid Khan (@_FaridKhan) August 19, 2023
తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన వసీమ్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ఆ తర్వాత అరవింద్ 25 పరుగులు చేశాడు.
4వ నంబర్‌లో బ్యాటింగ్ చేసిన ఆసిఫ్ ఖాన్ 29 బంతుల్లో అజేయంగా 48 పరుగులు, బాసిల్ హమీద్ 15.4 ఓవర్లలో అజేయంగా 12 పరుగులు చేశారు. దీంతో యూఏఈ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చారిత్రాత్మక విజయం..
TAKE THAT! Muhammad Waseem with an absolutely stunning knock for UAE against New Zealand. 55 runs off 29 balls, four fours and three sixes by the captain! UAE are on the verge of history 🔥 #UAEvNZpic.twitter.com/7OkuU1kfc5
— Farid Khan (@_FaridKhan) August 19, 2023
యూఏఈ జట్టుకు ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించడం ఇదే తొలిసారి. అది కూడా 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో యూఏఈ క్రికెట్ జట్టు కొత్త అధ్యాయానికి తెరతీసింది.
యూఏఈ ప్లేయింగ్ 11: ముహమ్మద్ వాసిమ్ (కెప్టెన్), ఆర్యన్ష్ శర్మ (వికెట్ కీపర్), వృత్త్యా అరవింద్, ఆసిఫ్ ఖాన్, అన్ష్ టాండన్, బాసిల్ హమీద్, అలీ నసీర్, అయాన్ అఫ్జల్ ఖాన్, మహ్మద్ ఫరాజుద్దీన్, ముహమ్మద్ జవదుల్లా, జహూర్ ఖాన్.
యూఏఈ రికార్డ్..
HISTORY IN DUBAI! UAE HAVE DEFEATED NEW ZEALAND IN THE 2ND T20I 🔥🔥🔥
UAE have beaten The Kiwis for the first time in history, they came so close to winning in the first match too but they finally did it tonight. Captain Waseem and Asif Khan, the superstars ❤️ #UAEvNZ pic.twitter.com/lGFTytrmE1
— Farid Khan (@_FaridKhan) August 19, 2023
న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: చాడ్ బోవ్స్, టిమ్ సీఫెర్ట్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్, కోల్ మెక్‌కాంచీ, రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌథీ (కెప్టెన్), బెన్ లిస్టర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




