AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్‌కు డబుల్ గూస్‌బంప్స్.. ఆ రూల్‎తో ఆసియా కప్‎లో ఆడొచ్చట

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత, క్రికెట్ అభిమానులంతా ఒకే విషయంపై ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, జట్టు ప్రకటన తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్ స్క్వాడ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్‌కు డబుల్ గూస్‌బంప్స్.. ఆ రూల్‎తో ఆసియా కప్‎లో ఆడొచ్చట
Acc Rule
Rakesh
|

Updated on: Aug 24, 2025 | 4:38 PM

Share

Shreyas Iyer : ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, ఈ జట్టులో అద్భుతమైన బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఈ నిర్ణయం చూసి చాలామంది అభిమానులు ఆశ్చర్యపోయారు. శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియాలో తప్పకుండా చోటు లభిస్తుందని అందరూ భావించారు కానీ అలా జరగలేదు. అయితే, జట్టును ప్రకటించిన తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్‌కు స్క్వాడ్‌లో చేరే అవకాశం ఉంది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్‌తో పాటు యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

శ్రేయస్ అయ్యర్‌కు ఛాన్స్ ఎలా?

ఏసీసీ నిబంధనల ప్రకారం, ఒకవేళ ఏదైనా జట్టులోని ఏ ఆటగాడైనా గాయపడితే, లేదా జట్టు మేనేజ్‌మెంట్ మరొక ఆటగాడిని తీసుకోవాలని భావిస్తే, వారి స్థానంలో మరొక ఆటగాడిని తీసుకోవచ్చు. ఈ నియమం ప్రకారం.. స్టాండ్‌బై జాబితాలో ఉన్న ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాలని లేదు. స్టాండ్‌బై జాబితాలో లేని ఆటగాళ్లకు కూడా జట్టులో చోటు లభించవచ్చు.

ఈ నిబంధనను బట్టి టోర్నమెంట్‌కు ముందు లేదా ఆసియా కప్ 2025 జరుగుతున్నప్పుడు భారత్ జట్టులోని ఏదైనా ఆటగాడు గాయపడితే, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కవచ్చు.

శ్రేయస్ అయ్యర్ టీ20 ప్రదర్శన

టీ20 క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. అతను తన బ్యాటింగ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో కూడా శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో జట్టు 2025 సీజన్ ఫైనల్‌కు చేరుకుంది. బ్యాటింగ్‌లోనూ అయ్యర్ తన సత్తా చూపించాడు. 17 మ్యాచ్‌లలో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని హయ్యాస్ట్ స్కోరు 97 నాటౌట్.

టీ20 క్రికెట్‌లో భారతదేశం తరపున అతను ఇప్పటివరకు 51 మ్యాచ్‌లు ఆడి, 30.66 సగటుతో 1104 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి, అతని అత్యధిక స్కోరు 74 నాటౌట్. ఓవరాల్‌గా 240 టీ20 మ్యాచ్‌లలో అయ్యర్ 34.08 సగటుతో 6578 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 147. ఈ ఫార్మాట్‌లో అతను మూడు సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..