Team India: ‘నో హ్యాండ్‌షేక్’ వెనకున్నది ఆయనే.. మ్యాచ్‌కు ముందే టీమిండియా ఆటగాళ్లకు కీలక సందేశం
Head Coach Gautam Gambhir Key Statement: క్రికెట్ మైదానంలో పాకిస్థాన్ కు భారత్ తన స్థానాన్ని చూపించింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ఆదివారం దుబాయ్ లో జరిగిన మెగా మ్యాచ్ లో టీమిండియా పాకిస్థాన్ ను ఏకపక్షంగా ఓడించింది. 25 బంతులు మిగిలి ఉండగానే భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించింది. పాకిస్థాన్ పై టీం ఇండియా సాధించిన ఈ భారీ విజయం తర్వాత టీం ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హర్షం వ్యక్తం చేశారు.

Team India: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత, భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారనే విషయంపై ప్రస్తుతం అనేక కథనాలు వెలువడుతున్నాయి. పలు నివేదికల ప్రకారం, ఈ చర్య వెనుక భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారని తెలుస్తోంది.
గంభీర్ కీలకమైన సందేశం..
మ్యాచ్‌కు ముందు, భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కారణంగా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ‘దేశద్రోహులు’ అని కూడా కొందరు విమర్శించారు. ఈ ఒత్తిడిని గమనించిన గంభీర్, ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు.
ఆటగాళ్లకు కీలకమైన సందేశం..
“సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టండి. బయటి మాటలను పట్టించుకోకండి. మీ పని కేవలం భారతదేశం కోసం ఆడటం. పహల్గామ్‌లో ఏం జరిగిందో మర్చిపోవద్దు. ఎవరితోనూ హ్యాండ్‌షేక్ చేయకండి, వారితో మాట్లాడటానికి ప్రయత్నించకండి.. బయటకు వెళ్లి, మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి, భారతదేశం కోసం విజయం సాధించండి” అని గంభీర్ చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అలాగే మ్యాచ్ తర్వాత గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, ‘ఒక జట్టుగా పహల్గామ్ దాడి బాధితులకు సంఘీభావం ప్రకటించాలనుకుంటున్నాం. ఆపరేషన్ సిందూర్ కు మా సైనికులకు ధన్యవాదాలు’ అని ఆయన అన్నారు.
ఈ విజయం అమర వీరులకు అంకితం..
గంభీర్ ఇచ్చిన ఈ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఆటగాళ్లు తూచా తప్పకుండా పాటించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలోనే పాక్ కెప్టెన్‌తో కరచాలనం చేయలేదు. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా అదే విధంగా ప్రవర్తించారు. గెలుపు తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, తమ విజయాన్ని పహల్గామ్ దాడిలో మరణించిన అమాయక ప్రజలకు, అలాగే ‘ఆపరేషన్ సింధూర్’ను విజయవంతం చేసిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. గంభీర్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు.
వివాదంపై భిన్నాభిప్రాయాలు..
భారత జట్టు నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. పాక్ కోచ్ మైక్ హెస్సన్, కెప్టెన్ సల్మాన్ అలీ ఆగ ఈ చర్యను ‘క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’గా అభివర్ణించారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా అధికారికంగా ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది. మాజీ పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ, ఆటను రాజకీయాలతో కలపవద్దని సూచించారు.
అయితే, భారత ఆటగాళ్ల నిర్ణయాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. గంభీర్ ఇచ్చిన సందేశం కేవలం ఆట గురించి మాత్రమే కాకుండా, దేశభక్తి, సెంటిమెంట్‌ను కూడా స్పృశించిందని అభిప్రాయపడుతున్నారు. ఆయన తన జట్టుకు కేవలం క్రికెట్ పాఠాలు మాత్రమే కాకుండా, దేశం పట్ల తమకున్న బాధ్యతను కూడా గుర్తు చేశారని ప్రశంసించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




