పాకిస్తాన్‌తో హ్యాండ్ షేకింగ్ వివాదం.. టీమిండియాకు జరిమానా పడనుందా.. ఐసీసీ రూల్ ఏం చెబుతోందంటే?
Team India: భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత, పాకిస్తాన్ ఆటగాళ్ళు టీం ఇండియాతో కరచాలనం చేయడానికి క్యూలో నిలబడ్డారు. కానీ, వారు అవమానానికి గురయ్యారు. టీం ఇండియా ఆటగాళ్ళు పాకిస్తాన్ క్రికెటర్లతో కరచాలనం చేయలేదు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే పాకిస్తాన్‌తో కరచాలనం చేయనందుకు టీం ఇండియాపై ఐసీసీ ఏదైనా జరిమానా విధిస్తుందా లేదా అనేది తెలుసుకుందాం..

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో ఆదివారం జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత చాలా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దుబాయ్‌లో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో గెలిచిన తర్వాత, టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ శివం దూబే పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా మైదానం నుంచి వెళ్లిపోయారు. ఈ మ్యాచ్‌లో 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్, 25 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ తో కరచాలనం చేయనందుకు టీం ఇండియాకు జరిమానా విధిస్తారా?
ఇలా చేయడం ద్వారా, టీమిండియా ఆటగాళ్ళు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. పాకిస్తాన్ కు తన స్థానాన్ని చూపించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత, పాకిస్తాన్ ఆటగాళ్ళు టీం ఇండియాతో కరచాలనం చేయడానికి క్యూలో నిలబడ్డారు. కానీ, వారు అవమానానికి గురయ్యారు. టీం ఇండియా ఆటగాళ్ళు పాకిస్తాన్ క్రికెటర్లతో కరచాలనం చేయలేదు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే పాకిస్తాన్‌తో కరచాలనం చేయనందుకు టీం ఇండియాపై ఐసీసీ ఏదైనా జరిమానా విధిస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. ఇంతలో, పాకిస్తాన్ జట్టు మేనేజర్ భారత ఆటగాళ్లు కరచాలనం చేయనందుకు ‘అధికారిక నిరసన’ దాఖలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి.
ఐసీసీ నియమం ఏం చెబుతోందంటే..
క్రికెట్ నియమాల ప్రకారం, మ్యాచ్ కు ముందు లేదా తర్వాత ఒక జట్టు తన ప్రత్యర్థితో ఎప్పుడూ కరచాలనం చేయకపోతే అది నేరం కాదు. కరచాలనం ఆట స్ఫూర్తిలో భాగంగా పరిగణిస్తుంటారు. మ్యాచ్ సమయంలో ఏ జట్టు లేదా దాని ఆటగాళ్లు తమ ప్రత్యర్థులతో కరచాలనం చేయమని బలవంతం చేయరు. క్రికెట్ సంస్కృతిలో భాగంగా మాత్రమే రెండు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ తర్వాత కరచాలనం చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) లేదా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహించే ఏ టోర్నమెంట్‌లోనూ కరచాలనం తప్పనిసరి కాదు.
టీం ఇండియాకు శిక్ష పడుతుందా?
పాకిస్తాన్ తో కరచాలనం చేయకపోవడం వల్ల టీం ఇండియాకు జరిమానా విధించరు. ఎందుకంటే అది క్రికెట్ నియమాన్ని ఉల్లంఘించలేదు. ఈ కారణంగా, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ మ్యాచ్ తర్వాత మ్యాచ్ ప్రెజెంటేషన్‌లోకి అడుగుపెట్టలేకపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తత పెరిగినందున ఈ మ్యాచ్ వివాదాలతో చుట్టుముట్టింది. దీని కారణంగా భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. మ్యాచ్‌కు ముందు కూడా, టాస్ సమయంలో సల్మాన్ అఘా, సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయలేదు. మ్యాచ్ తర్వాత, పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేయడానికి లేచి నిలబడ్డారు. కానీ భారత ఆటగాళ్లు అక్కడ లేరు. పాకిస్తాన్‌పై ఆసియా కప్‌లో టీం ఇండియా విజయాన్ని భారత సాయుధ దళాలకు భారతట టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంకితం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




