WPL 2023: నేడే డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్.. ముంబైతో అమీతుమీకి సిద్ధమైన యూపీ.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరో?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) టోర్నమెంట్ తొలి ఎడిషన్ తుది దశకు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ టైటిల్ రేసులో నిలిచాయి. ఇప్పటికే ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఢిల్లీ రెండింట్లో గెలిచి ఆరింటిలో ఓడి నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించింది.

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) టోర్నమెంట్ తొలి ఎడిషన్ తుది దశకు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ టైటిల్ రేసులో నిలిచాయి. ఇప్పటికే ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఢిల్లీ రెండింట్లో గెలిచి ఆరింటిలో ఓడి నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ముంబై-యూపీ మధ్య ఫైనల్ టికెట్ ఎవరికి దక్కుతుందో నేడు తేలనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మరియు అలిస్సా హీలీ నేతృత్వంలోని UP వారియర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఇవాళ (మార్చి 24) జరగనుంది. ముంబైలోని DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తుది పోరుకు అర్హత సాధిస్తుంది. కాగా టోర్నీ ఆరంభంలో వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచిన ముంబై మహిళల జట్టు మధ్యలో డీలా పడిపోయింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీకి కూడా ముంబై మాదిరిగానే 12 పాయింట్లు వచ్చాయి. అయితే రన్ రేట్ ఆధారంగానే ఫైనల్ కు దూసుకెళ్లింది ఢిల్లీ. ముంబయి జట్టు ఎక్కువగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, నథాలీ సెవర్ బ్రంట్‌లపై ఆధారపడింది. కెప్టెన్ హర్మన్ తొలి నుంచి జట్టుకు అండగా నిలుస్తోంది. అయితే సైకా ఇషాక్ గత మూడు మ్యాచ్‌ల్లో వికెట్ తీయలేకపోయాడం ముంబైకు మైనస్‌గా మారింది.
స్పిన్నర్లే బలం..
ఇక యూపీ వారియర్స్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి నాలుగింటిలో ఓడి ఎలిమినేటర్‌కు చేరుకుంది. జట్టు కెప్టెన్లు అలిస్సా హీలీ, తహలీ మెక్‌గ్రాత్, సోఫీ ఎక్లెస్టన్ మంచి ప్రదర్శన చేస్తారని భావిస్తున్నారు. స్పిన్నర్లే జట్టుకు ప్రధాన బలం. రాజేశ్వరి గైక్వాడ్, సోఫీ ఎక్లెస్టోన్, బౌలింగ్‌లో దీప్తి శర్మ రాణిస్తే ముంబై ఇండియన్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయవచ్చు. గాయం కారణంగా చివరి లీగ్ మ్యాచ్‌కు దూరమైన కీలక ప్లేయర్ గ్రేస్ హారిస్ నేడు బరిలోకి దిగే అవకాశం ఉంది.




ముంబై ఇండియన్స్:
యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్, హీథర్ గ్రాహం, క్లో ట్రయాన్ , సోనమ్ యాదవ్, నీలం బిష్త్, ప్రియాంక బాలా, ధారా గుజ్జర్
యూపీ వారియర్స్:
అలిస్సా హీలీ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవగిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, దేవికా వైద్య, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి సర్వాని, రాజేశ్వరి గైక్వాడ్, లార్ చోప్పాడి గైక్వాడ్, సోప్పాడి బెల్లారిస్, గ్రేషదాన్ బెల్లారిస్
Two Australian teammates ?? Two remarkable WPL captains ? Both with birthdays around the corner ??
Talking captaincy with Meg Lanning and Alyssa Healy ?
Full Interview?? #TATAWPL | #UPWvDC | @ahealy77 https://t.co/nkmxtUfA2L pic.twitter.com/Dsxd98zVXv
— Women’s Premier League (WPL) (@wplt20) March 22, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..