INDW vs ENGW:18 ఫోర్లు.. 4 సిక్సర్లు..143 రన్స్‌.. బ్రిటిష్‌ బౌలర్లను చితగ్గొట్టి రికార్డుల పరంపర

Harmanpreet Kaur: భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మళ్లీ జూలు విదిల్చింది. సెయింట్ లారెన్స్‌లోని స్పిట్‌ఫైర్ గ్రౌండ్‌ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో భారీ సెంచరీ సాధించింది.

INDW vs ENGW:18 ఫోర్లు.. 4 సిక్సర్లు..143 రన్స్‌.. బ్రిటిష్‌ బౌలర్లను చితగ్గొట్టి రికార్డుల పరంపర
Harmanpreet Kaur
Follow us
Basha Shek

|

Updated on: Sep 22, 2022 | 10:07 AM

Harmanpreet Kaur: భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మళ్లీ జూలు విదిల్చింది. సెయింట్ లారెన్స్‌లోని స్పిట్‌ఫైర్ గ్రౌండ్‌ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో భారీ సెంచరీ సాధించింది. ఆరంభం నుంచి బ్రిటిష్‌ బౌలర్లపై విరుచుకుపడిన కెప్టెన్ 111 బంతుల్లో అజేయంగా 143 పరుగులు చేసింది. ఇందులో 18 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండడం విశేషం. ఓవరాల్‌గా ఇది ఆమెకు ఐదో వన్డే సెంచరీ కాగా..పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక మొదటిది. ఈనేపథ్యంలో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుందీ స్టార్‌ ప్లేయర్‌. అవేంటంటే..

  • భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన స్మృతి మంధానతో కలిసి రెండో స్థానంలో నిలిచింది హర్మన్‌. హర్మన్‌ప్రీత్ 143 పరుగుల ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై ఇంగ్లండ్‌లో అత్యధిక స్కోరు చేసిన 26 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు1996లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ డాబీ హాక్లీ 117 పరుగులు చేసింది.
  • హర్మన్‌143 పరుగుల స్కోరు ఇంగ్లండ్‌పై మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ ఏడాది వరల్డ్‌కప్ ఫైనల్‌లో 170 పరుగులు చేసిన ఆస్ట్రేలియా లెజెండ్ అలిస్సా హీలీ పేరు మీద ఈ రికార్డు ఉండగా, బెలిండా క్లార్క్ అజేయంగా 146 పరుగులు చేసింది.
  • దీప్తి శర్మతో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 24 బంతుల్లోనే అజేయంగా 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంటే, ఇద్దరూ ఓవర్‌కు 17.75 పరుగుల చొప్పున పరుగులు జోడించారు. మహిళల ODIలో 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యానికి ఇదే వేగవంతమైన స్కోరింగ్ రేటు.
  • ఇంగ్లండ్‌పై ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నిలిచింది. దీనికంటే ముందు 2013లో ముంబైలో 107 పరుగులు చేసింది.
  • కాగా ఈ మ్యాచ్లో భారత్ 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది. వన్డే క్రికెట్‌లో టీమిండియా 300 మార్కును దాటడం ఇది నాలుగోసారి మాత్రమే. అందులోనూ ఈ ఏడాది రెండు సార్లు ఈ అద్భుతం జరిగింది. ఇంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా 317 పరుగులు చేసింది.
  • ఇంగ్లండ్‌పై వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అంతేకాదు ఇంగ్లండ్‌లోనూ టీమిండియాకు ఇదే భారీ వన్డే స్కోరు. 2017లో ఇంగ్లండ్‌పై 281 పరుగులు చేసిన టీమిండియా తాజాగా ఈ రికార్డును బద్దలు కొట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..