Team India: టీ20 ప్రపంచకప్‌కి మాత్రమే కాదు.. ఫుల్ టైం సారథి అతడే.. తేల్చిచెప్పేసిన మాజీ క్రికెటర్..
T20I World Cup 2024: టీ20లో భారత జట్టు కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చాడు. టీ20 ఫార్మాట్‌లోని సీనియర్ ఆటగాళ్లను తప్పించిన సెలక్టర్లు..
T20I World Cup 2024: టీ20లో భారత జట్టు కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చాడు. టీ20 ఫార్మాట్‌లోని సీనియర్ ఆటగాళ్లను తప్పించిన సెలక్టర్లు.. యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు.
టీ20లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా – ఆకాశ్ చోప్రా..
ఆకాష్ చోప్రా ప్రకారం, హార్దిక్ పాండ్యా టీ20లో కెప్టెన్‌గా కూడా చూడొచ్చు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, రెగ్యులర్ సారథిగా మాత్రం ప్రకటించలేదు. భవిష్యత్తులో టీ20లో హార్దిక్ టీమిండియా కెప్టెన్‌గా ఉంటాడు. అంటే రాబోయే టీ20 ప్రపంచకప్‌లో కూడా అతనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలిపాడు.
టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడంపై ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. టీ20 జట్టు ప్రస్తుతం బాగుంది. కేఎల్ రాహుల్ అందుబాటులో లేడు. కానీ, రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ తర్వాత ఆడలేదు. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో వెస్టిండీస్ సిరీస్ కోసం భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు. తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..