AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs GG-WPL 2023: ఆర్‌సీబీపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జెయింట్స్.. తుది జట్టు వివరాలివే..

టోర్నీలో భాగంగా ఇప్పటికే  ఆడిన పిచ్‌ కావడంతో మొదట బ్యాటింగ్‌కు మొగ్గు చూపుతున్నామని గుజరాత్ సారథి స్నేహ్‌ రాణా..

RCB vs GG-WPL 2023: ఆర్‌సీబీపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జెయింట్స్.. తుది జట్టు వివరాలివే..
Rcb Vs Gg Wpl 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 08, 2023 | 7:39 PM

Share

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్ టోర్నీ ఆరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ క్రమంలో తొలుత టాస్ గెలిచిన గుజరాత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. టోర్నీలో భాగంగా ఇప్పటికే  ఆడిన పిచ్‌ కావడంతో మొదట బ్యాటింగ్‌కు మొగ్గు చూపుతున్నామని గుజరాత్ సారథి స్నేహ్‌ రాణా పేర్కొంది. ఈ సందర్భంగా మాట్లాడిన స్నేహ్ రాణా.. టీమ్ కెప్టెన్‌గా నాయకత్వాన్ని తాను ఆస్వాదిస్తున్నానని, జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. ఇంకా తమకు బ్యాటింగ్‌ డెప్త్‌ ఉందని ధీమా వ్యక్తం చేసింది.

మరోవైపు పిచ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మొదట బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఏదైనా ఫర్వాలేదని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మంధాన తెలిపింది. అయితే మొదట బ్యాటింగ్‌ చేస్తే బాగుండేదని పేర్కొంది. ఒక బౌలింగ్‌ విభాగంగా తాము చర్చించుకున్నామని వెల్లడించింది. ‘తొలి రెండు మ్యాచులు మేం అనుకున్న మేరకు రాణించలేదు. ఫైనల్‌ లేదా ఎలిమినేటర్‌కు ముందు ఎనిమిది మ్యాచులు ఉన్నాయి. ఆ ప్రకారం చూస్తే ఇది మాకు చాలా కీలక మ్యాచ్‌. దిశా ఆడటం లేదు. ఆమె స్థానంలో పూనమ్‌ జట్టులోకి వచ్చింది’ అని మంధాన తెలిపింది.

ఇవి కూడా చదవండి

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్‌, దిశా కసత్‌, ఎలిస్‌ పెర్రీ, హీథర్‌ నైట్‌, రిచా ఘోష్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్‌, మేఘన్‌ షూట్‌, రేణుకా సింగ్‌, ప్రీతి బోస్‌, పూనమ్‌ కెమ్నార్‌

గుజరాత్‌ జెయింట్స్‌: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్‌ డియోల్‌,  యాష్లే గార్డ్‌నర్‌, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్‌ సుథర్‌ల్యాండ్‌, స్నేహ్ రాణా, తనుజా కన్వార్‌, కిమ్‌ గార్త్‌, మాన్సీ జోషీ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో