Rohit Sharma: జడేజాతో కష్టం.. ప్రతి బంతికి అప్పీల్‌ చేయమంటాడు: రోహిత్‌ శర్మ

మూడో టెస్టులో డీఆర్‌ఎస్‌‌లను సరిగ్గా వినియోగించుకోకపోవడంతో టీమిండియా అవసరమైన సమయంలో చాలా ఇబ్బంది పడింది. అయితే మూడో టెస్టులో చేసిన..

Rohit Sharma: జడేజాతో కష్టం.. ప్రతి బంతికి అప్పీల్‌ చేయమంటాడు: రోహిత్‌ శర్మ
Rohit Sharma On Drs And Ravindra Jadeja
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 08, 2023 | 7:59 PM

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించి దూకుడు మీదున్న టీమిండియాకు మూడో టెస్టులో ఆసీస్ జట్టు షాక్ ఇచ్చింది. స్పిన్‌ అస్త్రంతో నాథన్ లియాన్ చెలరేగడంతో భారత్‌ను ఓడించడంలో ఆ జట్టు సఫలీకృతమయింది. అయితే మరోవైపు ఈ మ్యాచ్‌లో స్వయం తప్పిదాలు  కూడా టీమిండియా ఓటమికి కారణం అయ్యాయి. అంతేకాక మూడో టెస్టులో డీఆర్‌ఎస్‌‌లను సరిగ్గా వినియోగించుకోకపోవడంతో టీమిండియా అవసరమైన సమయంలో చాలా ఇబ్బంది పడింది. అయితే మూడో టెస్టులో చేసిన ఈ తప్పులను నాలుగో టెస్టులో రిపీట్ చేయకుండా సరిదిద్దుకుంటామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ తెలిపాడు.

మీడియాతో రోహిత్ మాట్లాడుతూ..‘అవును మేము ఇండోర్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అంగీకరిస్తున్నాం. డీఆర్‌ఎస్‌కు వెళ్లడం కష్టం. ముఖ్యంగా రవీంద్ర జడేజాతో. అతను ప్రతి బంతిని ఔట్ అని భావిస్తాడు. ఆ మ్యాచ్‌లో చేసిన తప్పులను నాలుగో టెస్టులో సరిదిద్దుకోవాలని ఆశిస్తున్నాం. దీనిపై మేం చర్చించుకుంటాం. ఈ మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ను సరిగ్గా వినియోగించుకుంటామని భావిస్తున్నాం’ అని రోహిత్‌ శర్మ వివరించాడు.

కాగా, మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు మూడో టెస్టు విజయం కారణంగా ఆసీస్ జట్టు ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్‌కు చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా