GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తోనేకాదు, ఇంపాక్ట్ ప్లేయర్లతో హీటెక్కించారుగా
Gujarat Titans vs Punjab Kings, 5th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో 5వ మ్యాచ్ నేడు గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య జరగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది.

Gujarat Titans vs Punjab Kings, 5th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో 5వ మ్యాచ్ నేడు గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య జరగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది.
గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ, ‘ఈ వేదికపై మంచు ప్రభావం ఉంది. కాబట్టి మేం బౌలింగ్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. ఇంతలో, పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ‘మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం’ అని అన్నాడు.
గుజరాత్ తన సొంత మైదానం నరేంద్ర మోడీ స్టేడియంలో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 9 గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ మైదానంలో గుజరాత్ జట్టు తన తొలి IPL టైటిల్‌ను కూడా గెలుచుకుంది. 2022లో జరిగిన తొలి సీజన్‌లో, ఆ జట్టు ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR)ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
🚨 Toss 🚨@gujarat_titans have won the toss and opted to bowl first against @PunjabKingsIPL.
Updates ▶️ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS pic.twitter.com/7GUAOWuOeR
— IndianPremierLeague (@IPL) March 25, 2025
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: నేహాల్ వధేరా, ప్రవీణ్ దూబే, వైషాక్ విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్.
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, ఇషాంత్ శర్మ, అనుజ్ రావత్, వాషింగ్టన్ సుందర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..