PBKS vs GT: 9 బంతులు.. 244 స్ట్రైక్‌రేట్.. దడ పుట్టించిన ధావన్ టీంమేట్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
IPL 2023: తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 154 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గుజరాత్ టైటాన్స్ (GT), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య లీగ్ దశ మ్యాచ్ జరుగుతోంది. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 154 పరుగుల టార్గెట్ నిలిచింది.
మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లోనే ప్రభసిమ్రాన్ సింగ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రభాస్ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. శిఖర్ ధావన్‌ను జాషువా లిటిల్, మాథ్యూ షార్ట్‌ను రషీద్ ఖాన్, జితేష్ శర్మను మోహిత్ శర్మ పెవిలియన్‌కు పంపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..