IPL 2024: మాస్.. ఊరమాస్.! ఒక్క సెంచరీతో సచిన్ రికార్డును తిరగరాశాడు.. ఈ ధోని శిష్యుడు ఎవరో తెల్సా.?
11 మ్యాచ్‌లు.. 8 జట్లు.. 4 స్థానాలు.. ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకునేసరికి రసవత్తరమైన పోరు నెలకొంది. ఏ ఒక్క జట్టు ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాకపోగా.. అటు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో..

11 మ్యాచ్‌లు.. 8 జట్లు.. 4 స్థానాలు.. ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకునేసరికి రసవత్తరమైన పోరు నెలకొంది. ఏ ఒక్క జట్టు ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాకపోగా.. అటు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడిందని చెప్పాలి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై 35 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓ కుర్రాడి ప్రదర్శన మాజీ క్రికెటర్లను ఫిదా చేసింది. ఆ ప్రదర్శన చూసిన తర్వాత అతడ్ని టీమిండియా భవిష్యత్తు డైనమేట్‌గా అభివర్ణిస్తున్నారు దిగ్గజ ఆటగాళ్లు. మరి అతడు మరెవరో కాదు గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్.
చెన్నై నుంచి వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను గుజరాత్ టైటాన్స్ 2023 ఐపీఎల్ వేలంలో కేవలం రూ. 25 లక్షలకే సొంతం చేసింది. మనోడు తీసుకున్నది తక్కువే.. కానీ ఆట మాత్రం శాలరీ కంటే వెయ్యి రెట్లు ఉంటుంది. చెన్నైతో మ్యాచ్‌లో గిల్‌తో పాటు పోటాపోటీగా ఆడుతూ అదిరిపోయే సెంచరీ చేశాడు. అలాగే సచిన్ టెండూల్కర్‌కే సొంతమైన ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు సాయి సుదర్శన్. 18 బంతుల్లో అర్ధ సెంచరీని.. 50 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు సాయి సుదర్శన్. ఈ ఒక్క మ్యాచులోనే కాదు.. సీజన్ మొత్తం కూడా తన దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు సాయి సుదర్శన్. ఈ సీజన్‌లో 12 మ్యాచులాడిన సాయి.. 527 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉండగా.. అతడి బ్యాట్ నుంచి 48 ఫోర్లు, 16 సిక్సర్లు వచ్చాయి.
How to reach your maiden #TATAIPL century?
Sai-Su: 🙋♂️😎pic.twitter.com/hoYf1Ovfgt
— Gujarat Titans (@gujarat_titans) May 10, 2024
కాగా, ఐపీఎల్‌లో ఇన్నింగ్స్ పరంగా ఫాస్టెస్ట్ వెయ్యి పరుగులు సాధించిన భారత ఆటగాడిగా సాయి సుదర్శన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్-రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టాడు. సాయి సుదర్శన్ 25 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు సాధించగా.. సచిన్, రుతురాజ్ 31 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ అందుకున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..
