GT vs SRH: హైదరాబాద్‌తో మ్యాచ్‌కు దూరమైన టీమిండియా ఫ్యూచర్ స్టార్.. ఎందుకంటే?
Shubman Gill: ఏప్రిల్ 28న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా గిల్ ఫీల్డింగ్‌కు రాలేదు.యు అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను పంపారు. గిల్ లేనప్పుడు, రషీద్ ఖాన్ జట్టును నడిపించాడు. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల వయసులో అద్భుతమైన సెంచరీ సాధించాడు.

Shubman Gill: ఐపీఎల్ 2025లో 51వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, గుజరాత్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గాయం గురించి కీలక అప్‌డేట్ ఇచ్చాడు. గిల్ వెన్ను కండరాల నొప్పి నుంచి కోలుకునే పనిలో ఉన్నాడని, అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో అతని ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా అంచనా వేస్తామని ఆయన తెలిపాడు.
ఏప్రిల్ 28న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా గిల్ ఫీల్డింగ్‌కు రాలేదు.యు అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను పంపారు. గిల్ లేనప్పుడు, రషీద్ ఖాన్ జట్టును నడిపించాడు. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల వయసులో అద్భుతమైన సెంచరీ సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో విజయానికి నడిపించాడు. హైదరాబాద్‌తో జట్టు మ్యాచ్‌కు ముందు సోలంకి మాట్లాడుతూ- గిల్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకుంటే, అతనికి వీపులో కొంచెం నొప్పి ఉంది. మేం జాగ్రత్తగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నాం. అతను ఈరోజు (గురువారం) శిక్షణ చేస్తాడు. అతని పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అతను త్వరలోనే కోలుకుంటాడని మాకు నమ్మకంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
సూర్యవంశీ 35 బంతుల్లో 100 పరుగుల ఇన్నింగ్స్ తన జట్టుపై ఎలాంటి అదనపు ఒత్తిడిని కలిగించలేదని సోలంకి ప్రకటించాడు. అతను మాట్లాడుతూ.. ముందుగా, జట్టుకు హాని జరిగిందని నేను అనుకోను. ఆ యువ ఆటగాడి నుంచి మనం ఎటువంటి క్రెడిట్‌ను తీసివేయకూడదు. అతను చాలా బాగా ఆడాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మన్‌గా సూర్యవంశీ తెలిపాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ తర్వాత అతను రెండవ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సూర్యవంశీ 35 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. 2013లో గేల్ 30 బంతుల్లో సెంచరీ చేశాడు.
గుజరాత్ టైటాన్స్ జట్టు 9 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉంది. హైదరాబాద్‌పై విజయం సాధిస్తే రెండో స్థానానికి చేరుకోవచ్చు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








