Vaibhav Suryavanshi: ఇది చాలా పే…ద్ద మోసమేరా బుడ్డోడా.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Duryavanshi Real Age: బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ అనే చిన్న పట్టణంలో నివసించే వైభవ్ సూర్యవంశీ మొత్తం క్రికెట్ ప్రపంచంలోనే హల్చల్ చేస్తున్నాడు. 14 ఏళ్ల వైభవ్ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తి వైభవ్ వయస్సు గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Vaibhav Suryavanshi Real Age: బీహార్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. అతనికి కేవలం 14 సంవత్సరాలేనని తెలిసిందే. ఈ బుడ్డోడు ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలర్లను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. అతను ఇటీవల 35 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డుల్లో ఎక్కాడు. కానీ, అతని ఆటతో పాటు, అతని వయస్సు కూడా ప్రశ్నార్థకంగా ఉంది. భారత మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ వైభవ్ సూర్యవంశీ వయస్సుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇంతలో, సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వైభవ్ వయస్సు గురించి కీలక వాదన చేశాడు.
వైభవ్ సూర్యవంశీకి 14 ఏళ్లు కాదా?
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ అనే చిన్న పట్టణంలో నివసించే వైభవ్ సూర్యవంశీ వయస్సుపై గతంలో కూడా ప్రశ్నలు తలెత్తాయి. దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం 2023 సంవత్సరం నాటిది. అతని పాత ఇంటర్వ్యూ కారణంగా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆ సమయంలో, అతను తన పుట్టినరోజు సెప్టెంబర్‌లో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో, అతను సెప్టెంబర్‌లో తనకు 14 ఏళ్లు నిండుతాయని తెలిపాడు. కానీ, సర్టిఫికెట్‌లో అతని పుట్టిన తేదీ 27 మార్చి 2011గా ఉంది. ఇప్పుడు, ఇద్దరు వ్యక్తులతో కూడిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు వ్యక్తులు తాము వైభవ్ సూర్యవంశీ గ్రామానికి చెందిన వారమని, వైభవ్ అసలు వయస్సు 16 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నారు.
ఈ వీడియోలో ఒక వ్యక్తి మేం బీహార్‌లోని సమస్తిపూర్ నివాసితులమని చెబుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ అతనితో ఆడేవాడంట. అతను నెట్స్‌లో వైభవ్‌కు బౌలింగ్ కూడా చేసేవాడంట. వైభవ్ తండ్రి రోజూ వైభవ్‌ను పాట్నాకు తీసుకెళ్లేవాడు. మేం వైభవ్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేసేవాళ్ళం, ఆ తర్వాత పార్టీ చేసుకునేవాళ్ళం. ఆ వీడియోలో, ఈ వ్యక్తి బీహార్ కు చెందిన ఒక అబ్బాయి ఫేమస్ అవుతున్నాడని గర్వపడుతున్నానని, కానీ వైభవ్ వయసు 14 సంవత్సరాలు అని చూపిస్తున్నందుకు బాధగా ఉందని, అతని అసలు వయసు చెబితే బాగుండేదని, అతని అసలు వయసు 16 సంవత్సరాలు అని చెబుతున్నాడు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, వైభవ్ సూర్యవంశీ మరోసారి వివాదాలు చుట్టుముట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ముంబై ఇండియన్స్ పై విఫలం..
మే 1న ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నిశ్శబ్దంగా ఉంది. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 2 బంతులు మాత్రమే ఆడగలిగాడు. ఖాతా తెరిచిన తర్వాత తన వికెట్‌ను కోల్పోయాడు. అంతకుముందు, అతను ఏప్రిల్ 19న తన ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడాడు. అక్కడ అతను 34 పరుగులు చేయడంలో విజయం సాధించాడు. ఆ తరువాత అతను RCB పై 16 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ పై చారిత్రాత్మక సెంచరీ సాధించాడు. కానీ, ముంబైపై విఫలమయ్యాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








