SRH vs GT: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. జోరు కొనసాగేనా? ప్లేయింగ్ 11 ఇదే..
SRH vs GT, IPL 2024: గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జట్టు పునరాగమనం పరిశీలనలో ఉంది. సొంత మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ ఓడించింది. ఆ జట్టు 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.
Sunrisers Hyderabad vs Gujarat Titans, IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 (IPL 2024)లో గత ఏడాది ఫైనల్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది. ఆ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ వంటి బ్యాట్స్‌మెన్లు ముంబై బౌలర్లను చిత్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లో ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుతుంది.
కాగా, గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జట్టు పునరాగమనం పరిశీలనలో ఉంది. సొంత మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ ఓడించింది. ఆ జట్టు 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ, మంచి నెట్ రన్ రేట్ కారణంగా ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
🚨 Toss Update 🚨
Sunrisers Hyderabad have elected to bat against Gujarat Titans in Match 12 of #TATAIPL 2024.
Follow the match ▶️ https://t.co/hdUWPFsHP8 #GTvSRH | @gujarat_titans | @SunRisers pic.twitter.com/biGZbav8h0
— IndianPremierLeague (@IPL) March 31, 2024
హెడ్ టు హెడ్ రికార్డులు: సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో గుజరాత్ 2 గెలిచింది. 2023లో జరిగిన చివరి మ్యాచ్‌లో గుజరాత్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇరు జట్లు:
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శరత్ బీఆర్, మానవ్ సుతార్, అభినవ్ మనోహర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ రెడ్డి, ఉపేంద్ర యాదవ్.
గుజరాత్ టైటాన్స్‌లో ప్రాబబుల్ ప్లేయింగ్-11: శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్-11: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కెండే, టి నటరాజన్/జయ్‌దేవ్ ఉనద్కత్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..