VIdeo: ఒరేయ్ ఆజామూ కోట్ల రూపాయలు వరదలో కొట్టుకుపోయాయిరా! ఒక్క వర్షానికే గడాఫీ స్టేడియం లీక్! వైరల్ అవుతున్న వీడియో
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ మౌలిక సదుపాయాల లోపాలు మరోసారి బయటపడ్డాయి. లాహోర్ గడాఫీ స్టేడియం ఒక్క వర్షానికే నీటమునిగిపోవడంతో PCB ప్రతిష్ట దెబ్బతింది. పునరుద్ధరణ తర్వాత కూడా మౌలిక సమస్యలు కొనసాగుతుండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు మరోసారి ఆటంకం కలిగించడంతో, పాక్ టోర్నమెంట్ నిర్వహణ సామర్థ్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ తొందరగా నిష్క్రమించడం ఒక్కటే కాదు, మరో వివాదంలోనూ ఇరుక్కుంది. కొత్తగా పునరుద్ధరించిన లాహోర్ గడాఫీ స్టేడియం ఒక్క వర్షానికే నీటమునిగిపోవడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రతిష్టను దిగజార్చింది. ఈ స్టేడియం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు వేదిక కానుండగా, భారత్ అర్హత సాధిస్తే మ్యాచ్ దుబాయ్‌కు మార్చే అవకాశముంది.
స్టేడియంలకు వర్షం పరీక్ష – PCB హామీలు ఫెయిల్
పునరుద్ధరణల అనంతరం స్టేడియంలు సరిగ్గా తయారయ్యాయని PCB భరోసా ఇచ్చినప్పటికీ, వైరల్ అవుతున్న వీడియోలు మరో కథ చెబుతున్నాయి. వాష్‌రూమ్ ప్రాంతాల్లో నీరు కారటం, స్థలంలోని గజిబిజి పరిస్థితి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోలతో PCB చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఐసిసి ఈవెంట్ నిర్వహణలో విఫలమైన PCB
30 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఐసిసి టోర్నమెంట్‌ను ఆతిథ్యం ఇచ్చినా, నిర్వాహణలో తీవ్రమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం PCB లాహోర్ గడాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియం, రావల్పిండి క్రికెట్ స్టేడియంలను అప్‌గ్రేడ్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఫ్లడ్‌లైట్లు, హాస్పిటాలిటీ బాక్స్‌లు, ఎలక్ట్రానిక్ స్కోర్‌బోర్డులు, LED టవర్లు వంటి పలు మార్పులు చేసినా, అసలు మౌలిక సదుపాయాలపైనే సరైన దృష్టి పెట్టకపోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది.
అభిమానులకు తగిన భద్రత లేకపోవడం, తక్కువ స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థలు, కురిసిన ఒకే ఒక్క వర్షానికి స్టేడియంలు నీటమునిగిపోవడం వంటి సమస్యలు బయటపడటంతో PCB నిర్వహణ సామర్థ్యం ప్రశ్నార్థకమైంది.
వాతావరణం ప్రభావంతో మ్యాచ్‌లు రద్దు – PCBపై మరింత ఒత్తిడి
రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన రెండు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పూర్తిగా వర్షార్పణమయ్యాయి. ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయ్యాయి. దీనివల్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, PCB టికెట్ ధరల పూర్తి రిఫండ్ ఇస్తామని ప్రకటించింది.
ఈ పరిస్థితులు మొత్తం చూస్తే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టోర్నమెంట్ నిర్వహణలో విఫలమైందని స్పష్టమవుతోంది. మౌలిక సదుపాయాల్లో లోపాలు, అకస్మాత్తుగా రద్దైన మ్యాచ్‌లు, అభిమానుల అసంతృప్తి – ఇవన్నీ కలిసి PCB ప్రతిష్టను మరింత దెబ్బతీశాయి. ఇకపై పాక్ క్రికెట్ బోర్డు ఎలా ముందుకు వెళ్లనుందో చూడాలి.
لاہور کا قذافی اسٹیڈیم ایک ہی بارش میں ٹپک پڑا۔۔۔!!! pic.twitter.com/MuIcB6oxDZ
— Mughees Ali (@mugheesali81) March 1, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



