AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

0, 6, 1, 9, 0.. ఒత్తిడి తట్టుకోలేక సుస్సు పోసుకుంటున్న టీమిండియా బ్యాటర్లు..

IND vs ENG: 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు తడబడుతూ.. వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, ఆకాష్ దీప్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ఆటగాళ్లు ఛేజింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

0, 6, 1, 9, 0.. ఒత్తిడి తట్టుకోలేక సుస్సు పోసుకుంటున్న టీమిండియా బ్యాటర్లు..
Team India
Venkata Chari
|

Updated on: Jul 14, 2025 | 4:33 PM

Share

లార్డ్స్ వేదికగా జరుగుతోన్న భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్ చివరి రోజు ఉత్కంఠభరితంగా మారింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు తడబడుతూ.. వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, ఆకాష్ దీప్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ఆటగాళ్లు ఛేజింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

నిరాశపరిచిన యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్..

భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన యశస్వి జైస్వాల్ (0) ఏడు బంతుల్లో డకౌట్ అవ్వడం టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఆర్చర్ బౌన్సర్‌కు పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, ఈ కీలక ఛేజింగ్‌లో అతను పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసిన జైస్వాల్, రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవలేకపోయాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (6) కూడా తక్కువ స్కోరుకే అవుట్ అయిపోవడం భారత శిబిరంలో ఆందోళన కలిగించింది. బ్రిడాన్ కార్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన గిల్, కెప్టెన్‌గా జట్టుకు కావాల్సిన స్థిరత్వాన్ని ఇవ్వలేకపోయాడు. ఈ సిరీస్‌లో గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, ఈ కీలక ఛేజింగ్‌లో అతను విఫలం కావడం జట్టును ఒత్తిడిలోకి నెట్టింది.

ఆకాష్ దీప్ నిష్క్రమణతో పెరిగిన ఒత్తిడి..

నైట్‌వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఆకాష్ దీప్ (1) కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 58/4తో కష్టాల్లో పడింది. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేసి అద్భుతంగా రాణించినప్పటికీ, బ్యాటింగ్‌లో అతను తనవంతు సహకారం అందించలేకపోయాడు.

రిషభ్ పంత్ విఫలం..

తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులతో మెరిసిన రిషభ్ పంత్, జట్టును ఆదుకున్నప్పటికీ, కీలకమైన నాలుగో ఇన్నింగ్స్ ఛేజింగ్‌లో కేవలం 9 పరుగులే చేసి, పెవిలియన్ చేరాడు. పంత్ నుంచి మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆశించారు. గబ్బాలో ఆస్ట్రేలియాపై విజయాన్ని అందించిన విధంగా ఇక్కడ కూడా పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడితే విజయం సాధ్యమని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కానీ, 9 పరుగులకే వెనుదిరిగాడు.

బౌలింగ్‌లో మెరిసినా.. బ్యాటింగ్‌లో తుస్సుమన్న వాషింగ్టన్ సుందర్..

వాషింగ్టన్ సుందర్ బంతితో అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను 192 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, బ్యాటింగ్‌లో అతని పాత్ర ఈ ఛేజింగ్‌లో మాత్రం జీరోగా మారింది. సుందర్ ఒక ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు సంపాదించుకున్నప్పటికీ, ఒత్తిడిలో బ్యాటింగ్‌ చేయడం మర్చిపోయాడు. జీరో పరుగులకే పెవిలియన్ చేరాడు.

లార్డ్స్‌లో 193 పరుగుల లక్ష్యం అంత పెద్దది కానప్పటికీ, వికెట్ల పతనం భారత శిబిరంలో ఆందోళన కలిగించింది. ఒత్తిడి తట్టుకోలేకపోయిన భారత బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే చాప చుట్టేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..భారత