AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరగదీస్తాడని 8 ఏళ్ల తర్వాత ఛాన్స్ ఇస్తే.. కట్‌చేస్తే.. గంభీర్, గిల్‌ పరువు తీసిన ట్రిపుల్ సెంచరీ ప్లేయర్

IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు, ఒక భారత బ్యాట్స్‌మన్ వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు.  దీంతో ఈ బ్యాట్స్‌మన్ టెస్ట్ కెరీర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఇకపై టీమిండియా జెర్సీ వేసుకునే అర్హత కోల్పోతాడని భావిస్తున్నారు.

ఇరగదీస్తాడని 8 ఏళ్ల తర్వాత ఛాన్స్ ఇస్తే.. కట్‌చేస్తే.. గంభీర్, గిల్‌ పరువు తీసిన ట్రిపుల్ సెంచరీ ప్లేయర్
Karun Nair
Venkata Chari
|

Updated on: Jul 14, 2025 | 5:49 PM

Share

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మూడో టెస్టులో భారత బ్యాటర్ కరుణ్ నాయర్ మరోసారి నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి పెద్దగా పరుగులు చేయకుండానే ఔటవడంతో సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ట్రిపుల్ సెంచరీ వీరుడిగా పేరు తెచ్చుకున్న కరుణ్ నాయర్, సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ, తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో అభిమానులు శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కరుణ్ నాయర్ వరుస వైఫల్యాలు..

ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో నాయర్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అవ్వగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో 31, 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇక లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని పొందినప్పటికీ, దానిని భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. మొత్తం మీద ఈ సిరీస్‌లో కరుణ్ నాయర్ ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్ లలో 0, 20, 31, 26, 40, 14 పరుగులు చేశాడు. పేలవమైన ప్రదర్శన కారణంగా, కరుణ్ నాయర్ టెస్ట్ కెరీర్ ఇంగ్లాండ్ పర్యటనలోనే ముగియవచ్చు. ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జట్టులోకి వచ్చిన నాయర్, అంతర్జాతీయ స్థాయిలో తన ఫామ్‌ను కొనసాగించలేకపోతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్, డిమాండ్లు..

కరుణ్ నాయర్ వరుస వైఫల్యాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. అభిమానులు “నాయర్ ఖేల్ ఖతం”, “ఇక దేశవాళీ క్రికెట్ ఆడుకో” అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. కీలకమైన టెస్టు సిరీస్‌లో ఒక సీనియర్ బ్యాటర్ నుంచి ఇలాంటి ప్రదర్శనను ఊహించలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అదే సమయంలో, చాలా మంది అభిమానులు శ్రేయాస్ అయ్యర్‌ను టెస్టు జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్ ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను రంజీ ట్రోఫీలో ముంబై తరపున కీలకమైన సెంచరీలు సాధించి ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా, అతను దూకుడైన బ్యాటింగ్‌తో పాటు ఒత్తిడిలో నిలబడగల సత్తా ఉందని నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, మధ్య వరుసలో బ్యాటింగ్ భారాన్ని మోయగల సత్తా శ్రేయాస్ అయ్యర్‌కు ఉందని అభిమానులు విశ్వసిస్తున్నారు. గతంలో టీ20, వన్డే ఫార్మాట్లలో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శనలు చేయడమే కాకుండా, టెస్టుల్లో కూడా మంచి ఆరంభాలను ఇచ్చాడు. అతనికి జట్టులో తగినన్ని అవకాశాలు లభించడం లేదని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.

సెలెక్టర్ల ముందు సవాల్..

కరుణ్ నాయర్ ప్రస్తుత ప్రదర్శన సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. నాలుగో టెస్టుకు అతడిని తుదిజట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. అతని స్థానంలో ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం కల్పించాలనే వాదనకు బలం చేకూరుతోంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే వాదనతో పాటు, సీనియర్ ఆటగాళ్లకు కూడా తగినన్ని అవకాశాలు ఇవ్వాలనే మరో వాదన కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో భారత జట్టు యాజమాన్యం, సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..