AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: లార్డ్స్ టెస్ట్ చూసేందుకు బాలీవుడ్ నటితో వచ్చిన స్టార్ హీరో.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

Akshay Kumar: అక్షయ్ కుమార్ ఫొటో టీవీ స్క్రీన్‌పై కనిపించగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆయన టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కూర్చుని ఉన్నాడు. ఆ పక్కనే బాలీవుడ్ నటి కూడా కనిపించింది. ఈ ఫొటో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Video: లార్డ్స్ టెస్ట్ చూసేందుకు బాలీవుడ్ నటితో వచ్చిన స్టార్ హీరో.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?
Akshay Kumar And Twinkle Kh
Venkata Chari
|

Updated on: Jul 14, 2025 | 6:44 PM

Share

Akshay Kumar: లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. ఇరు జట్ల అభిమానులు ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో లార్డ్స్‌లో భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఇందులో సాధారణ అభిమానులే కాదు, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ప్రత్యేకత ఏమిటంటే అక్షయ్ కుమార్ ఒంటరిగా లేడు, ఒక బాలీవుడ్ నటి కూడా అతనితో ఉంది. దీంతో వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సోమవారం, జులై 14 లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లోని మూడవ మ్యాచ్ చివరి రోజు. టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. ప్రస్తుతం భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ఇంకా 70 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ విజయానికి మరో 2 వికెట్లు తీయాల్సి ఉంది.

అక్షయ్ కుమార్ ఏ నటితో వచ్చాడంటే..

అక్షయ్ కుమార్ ఫొటో టీవీ స్క్రీన్‌పై కనిపించగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆయన టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కూర్చుని ఉన్నాడు. ఆ పక్కనే బాలీవుడ్ నటి కూడా కనిపించింది. ఈ ఫొటో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ, చాలామంది ఈ నటిని గుర్తించలేకపోయారు. అక్షయ్ ఏ నటితో లార్డ్స్ టెస్ట్ చూడటానికి వచ్చాడనే ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అక్షయ్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో మ్యాచ్ చూసేందుకు వచ్చాడు.

అక్షయ్‌పై ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్?

అయితే, కొంతమంది అభిమానులు అక్షయ్ కుమార్ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి రావడం ఇష్టపడలేదు. బాలీవుడ్ స్టార్ ఉండటం వల్ల టీం ఇండియా ఓటమి ఖాయమని సోషల్ మీడియాలో రాసుకొస్తు్న్నారు. ఈ క్రమంలో వినియోగదారులు అక్షయ్ పాత ఫొటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. అవి 2021 టీ20 ప్రపంచ కప్ నుంచి తీసుకున్నవి. ఈ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఇందులో పాకిస్తాన్ టీం ఇండియాను ఓడించింది. ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్ భారతదేశంపై గెలిచిన ఏకైక మ్యాచ్ ఇదే.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ