IND vs NZ: ఈ ముగ్గురు ఆటగాళ్లకు అర్హతే లేదు.. కట్‌చేస్తే.. కోచ్ గంభీర్ దయతో భారత జట్టులోకి రీఎంట్రీ..!
India vs New Zealand: న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలో బీసీసీఐ 15మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, ఈ స్వ్కాడ్‌లో కొన్ని షాకింగ్ పేర్లు కనిపించాయి. ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్ల ఎంపికపై విమర్శలు వినిపిస్తున్నాయి.

India vs New Zealand: జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం సెలెక్టర్లు జనవరి 3న భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాడు. గిల్ ప్రస్తుతం ప్లీహము (Spleen) గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే అతని పేరు పక్కన ‘స్టార్’ గుర్తు ఉంది. అంటే బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి అతనికి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదని అర్థం. వైద్య బృందం అనుమతి ఇస్తేనే ఆయన మైదానంలోకి దిగుతాడు.
అయితే, ఈ జట్టులో ఎంపికైన ముగ్గురు ఆటగాళ్లపై తీవ్ర చర్చ జరుగుతోంది. వారి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్నా, కేవలం కోచ్ గౌతమ్ గంభీర్ చొరవతోనే వారికి చోటు దక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఓసారి చూద్దాం..
1. రిషబ్ పంత్: లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను సెలెక్టర్లు వన్డే జట్టులోకి తీసుకున్నారు. అయితే, 2025 సంవత్సరంలో పంత్‌కు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఏడాది పొడవునా అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీ (2025-26)లో కూడా పంత్ పెద్దగా ప్రభావం చూపలేదు. 5 మ్యాచ్‌ల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలతో 188 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో ధ్రువ్ జురెల్ (379 పరుగులు), ఇషాన్ కిషన్ (2 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో 146 పరుగులు) అద్భుతంగా రాణిస్తున్నా బీసీసీఐ వారిని విస్మరించింది.
2. నితీష్ కుమార్ రెడ్డి: యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా జట్టులో చోటు దక్కింది. కానీ అతని గత గణాంకాలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఇప్పటివరకు ఆడిన రెండు వన్డేల్లో నితీష్ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతని ఎకానమీ రేటు కూడా 7.74 గా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క అర్థ సెంచరీ, 6 వికెట్లు మాత్రమే తీశాడు. అయినప్పటికీ సెలెక్టర్లు అతనికి వన్డే క్యాప్ ఇచ్చేందుకు మొగ్గు చూపారు.
3. ప్రసిద్ధ్ కృష్ణ: ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణపై కోచ్ గంభీర్ ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు కనిపిస్తోంది. ప్రసిద్ధ్ ఇప్పటివరకు 21 వన్డేల్లో 37 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేటు 6.02 గా ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరపున కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. మరోవైపు, ఇదే టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్న మొహమ్మద్ షమీని సెలెక్టర్లు పక్కన పెట్టి ప్రసిద్ధ్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.




