AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA Final Umpires: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఫైనల్ పోరుకు ఆ ఇద్దరు ‘బ్యాడ్’ అంపైర్లు..

IND vs SA Final Umpires: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జూన్ 28న బార్బడోస్‌లో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ మ్యాచ్‌కు అంపైర్లను ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తుండగా, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బ్రో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన రోడ్నీ టక్కర్ నాలుగో అంపైర్‌గా వ్యవహరిస్తారు.

IND vs SA Final Umpires: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఫైనల్ పోరుకు ఆ ఇద్దరు 'బ్యాడ్' అంపైర్లు..
Ind Vs Sa Final Umpires
Venkata Chari
|

Updated on: Jun 28, 2024 | 3:11 PM

Share

IND vs SA Final Umpires: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జూన్ 28న బార్బడోస్‌లో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ మ్యాచ్‌కు అంపైర్లను ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తుండగా, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బ్రో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన రోడ్నీ టక్కర్ నాలుగో అంపైర్‌గా వ్యవహరిస్తారు. ఈ మ్యాచ్‌లో రిచీ రిచర్డ్‌సన్ రిఫరీగా వ్యవహరించనున్నారు. గత నాలుగేళ్లలో, ICC టోర్నమెంట్‌లలో భారత్ ఓడిపోయిన ఐదు నాకౌట్‌లలో నాలుగింటిలో ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బ్రోలు అంపైర్లుగా ఉన్నారు. 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 WTC ఫైనల్, 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లలో భారత్ ఈ ఓటమిని చవిచూసింది.

2013 తర్వాత తొలిసారిగా ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి టైటిల్ అందుకోలేదు. ఈ సమయంలో, 2014 T20 ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయింది. WTC 2021, 2023 ఫైనల్స్‌లో కూడా ఓటమి ఎదురైంది. ఇవి కాకుండా 2015 వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో ఓటములు ఎదురయ్యాయి. 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బ్రో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. 2021 WTC ఫైనల్‌లో, ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఉండగా, క్యాటిల్‌బ్రో టీవీ అంపైర్ అయ్యాడు. 2023 WTC ఫైనల్‌లో కూడా అదే జరిగింది. 2023 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇద్దరూ ఆన్-ఫీల్డ్ అంపైర్లు. ఇల్లింగ్‌వర్త్ 2010 నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్‌గా వ్యవహరిస్తున్నారు. క్యాటిల్‌బ్రో 2009 నుంచి ఈ పాత్రలో ఉన్నారు.

భారత్, దక్షిణాఫ్రికా రెండూ అజేయంగా ఫైనల్‌కు..

టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ అజేయంగా ఉండగానే ఫైనల్స్‌కు చేరుకుంది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. అందులో ఏడు గెలిచింది. వర్షం కారణంగా ఒక ఫలితం రాలేదు. తొలిసారిగా సీనియర్ స్థాయిలో ఐసీసీ ట్రోఫీ ఫైనల్ ఆడబోతున్న దక్షిణాఫ్రికా.. ఈ ఎడిషన్‌లోనూ అజేయంగా నిలిచింది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..