IPL 2024, SRH: కావ్యాపాప ప్రక్షాళన షురూ.. టార్గెట్ 2024 ట్రోఫీ.. ఎస్‌ఆర్‌హెచ్ కొత్త కోచ్‌గా కోహ్లీ మాజీ టీంమేట్..

Daniel Vettori: గత రెండు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐపీఎల్ 2023లో ప్రధాన కోచ్‌గా బ్రియాన్ లారా నియమితులయ్యారు. కానీ, లారా నాయకత్వంలో SRH మరింత దిగజారింది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన SRH జట్టు కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అంతే కాకుండా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి తీవ్ర ఇబ్బందిని చవిచూసింది.

IPL 2024, SRH: కావ్యాపాప ప్రక్షాళన షురూ.. టార్గెట్ 2024 ట్రోఫీ.. ఎస్‌ఆర్‌హెచ్ కొత్త కోచ్‌గా కోహ్లీ మాజీ టీంమేట్..
Daniel Vettori
Follow us

|

Updated on: Aug 07, 2023 | 4:44 PM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. RCB, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇప్పటికే కొత్త కోచ్‌లను నియమించాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ కూడా బ్రియాన్ లారాను కోచ్ పదవి నుంచి తప్పించింది. న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెట్టోరీ కొత్త కోచ్‌గా నియమితులయ్యారు.

గతంలో ఆర్సీబీ జట్టుకు కెప్టెన్‌గా, ఆపై కోచ్‌గా కనిపించిన వెట్టోరి ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేతులు కలిపాడు. న్యూజిలాండ్ మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ వెట్టోరి ప్రస్తుతం కొనసాగుతున్న హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతను ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి రావడం విశేషం.

ఇవి కూడా చదవండి

RCB మాజీ కోచ్..

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున వెట్టోరి 34 మ్యాచ్‌లు ఆడి మొత్తం 38 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా 2011లో వెట్టోరి సారథ్యంలో ఆర్సీబీ ఫైనల్లోకి ప్రవేశించడం విశేషం. ఆ తర్వాత, అతను 2015 నుంచి 2018 వరకు RCB జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. అతని కోచింగ్‌లో RCB 2015లో ప్లేఆఫ్‌లోకి, 2016లో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఈ కారణాలన్నింటి దృష్ట్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రధాన కోచ్‌గా డేనియల్ వెట్టోరీని నియమించింది.

SRH పేలవమైన ఆటతీరుతో..

గత రెండు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐపీఎల్ 2023లో ప్రధాన కోచ్‌గా బ్రియాన్ లారా నియమితులయ్యారు. కానీ, లారా నాయకత్వంలో SRH మరింత దిగజారింది.

గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన SRH జట్టు కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అంతే కాకుండా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి తీవ్ర ఇబ్బందిని చవిచూసింది. దీని కారణంగా, ఇప్పుడు ప్రధాన కోచ్‌గా ఉన్న బ్రియాన్ లారాను మేనేజ్మెంట్ తొలగించింది. అలాగే, RCB జట్టును ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్/కోచ్ డేనియల్ వెట్టోరీని కొత్త ప్రధాన కోచ్‌గా నియమించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..