- Telugu News Photo Gallery Cricket photos Team india young player Tilak Varma dedicated his maiden T20I fifty to Rohit Sharma’s daughter Samaira
Tilak Varma: తొలి అర్ధ సెంచరీని రోహిత్ శర్మ కుమార్తెకు అంకితమిచ్చిన తిలక్ వర్మ.. ఎందుకో తెలుసా?
Tilak Varma, IND vs WI 2nd T20I: మే 12, 2022… ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి తిలక్ వర్మ ప్రశంసలు అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియా తరపున ఆడగలంటూ రోహిత్ పేర్కొన్నాడు. తిలక్ వర్మకు 19 ఏళ్లు మాత్రమేనని, అతను చాలా ప్రశాంతమైన మనస్సుతో ఆడుతాడని, త్వరలో టీమ్ ఇండియా తరపున 3 ఫార్మాట్లలో ఆడతాడని భావిస్తున్నాను.
Venkata Chari | Edited By: Ravi Kiran
Updated on: Aug 07, 2023 | 10:25 PM

Tilak Varma, IND vs WI 2nd T20I: గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తలపడుతోంది. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ రెండో టీ20లో హాఫ్ సెంచరీ సాధించాడు. తిలక్ 41 బంతుల్లో 51 పరుగులు చేసి భారత్‌కు పోరాడే స్కోర్ అందించాడు.

భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తొందరగానే పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ జట్టు స్కోరు 150 పరుగులకు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు.

దీని ద్వారా తిలక్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు తిలక్ తన హాఫ్ సెంచరీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమీరాకు అంకితం చేశాడు.

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన తిలక్ వర్మ సమైరాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. నేను నా తొలి సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేసినప్పుడు ఇలాగే వేడుకలు చేసుకుంటానని ఆమెకు వాగ్దానం చేశానని ఈ యంగ్ ప్లేయర్ వెల్లడించాడు.

ఈ ఫిఫ్టీతో తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరపున ఫిఫ్టీ సాధించిన రెండో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. దీంతో రిషబ్ పంత్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

Tilak20 ఏళ్ల 143 రోజుల వయసులో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి అర్ధ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. తిలక్ ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు. 20 సంవత్సరాల 271 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. రిషబ్ పంత్ మూడో స్థానానికి పడిపోయాడు. 21 ఏళ్ల 38 రోజుల్లో ఈ ఫీట్ సాధించాడు.Varma India

2007 టీ20 ప్రపంచకప్‌లో టీ20ల్లో రోహిత్ తొలి అర్ధ సెంచరీ సాధించాడు. 2018లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్‌పై రిషబ్ పంత్ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో తిలక్ వర్మ ఈ రికార్డు సృష్టించాడు.





























