Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Award: క్రికెట్ చరిత్రలో అత్యంత స్పెషల్ అవార్డ్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు ఏమిచ్చారో తెలిస్తే షాకే..

Unique Man Of The Series Award: మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందజేస్తారు. అలాగే, మొత్తం సిరీస్‌లో లేదా మొత్తం టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందజేస్తారు. ఈ అవార్డు రూపంలో ఆటగాళ్లకు చెక్, ట్రోఫీ, బైక్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందజేస్తారు.

Venkata Chari

|

Updated on: Aug 07, 2023 | 9:29 PM

ఇటీవల కెనడాలో గ్లోబల్ టీ20 లీగ్ నిర్వహించారు. ఈ లీగ్‌లో ప్రపంచ స్టార్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సర్రే జాగ్వార్స్ vs మాంట్రియల్ టైగర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో మాంట్రియల్ టైగర్స్ జట్టు విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

1 / 5
ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన వెస్టిండీస్ క్రికెటర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డుతో అతనికి డబ్బు, బైక్, కారు ఇవ్వలేదు. భూమి ఇచ్చారు.

2 / 5
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌కు అమెరికాలో అర ఎకరం భూమి లభించింది. రూథర్‌ఫోర్డ్ అందుకున్న ఈ అవార్డుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

3 / 5
ఆఖరి మ్యాచ్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 29 బంతుల్లో 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.

4 / 5
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్ 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సర్రే తరపున జతీంద్ర సింగ్ 57 బంతుల్లో 56 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన మాంట్రియల్ టైగర్స్ 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆండ్రీ రస్సెల్ 6 బంతులు ఎదుర్కొంటూ 20 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి.

5 / 5
Follow us