Yuvraj Singh: యువరాజ్ సింగ్‌ అరెస్టు.. టీమిండియా క్రికెటర్‌ని కులంపేరుతో దూషించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు..!

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన సహచర క్రికెటర్‌ను కించపరిచేలా మాట్లాడినందుకు హర్యానాలో అరెస్ట్ అయ్యాడు.

Yuvraj Singh: యువరాజ్ సింగ్‌ అరెస్టు.. టీమిండియా క్రికెటర్‌ని కులంపేరుతో దూషించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు..!
Yuvraj Singh Arrest
Follow us

|

Updated on: Oct 17, 2021 | 10:07 PM

Yuvraj Singh Arrest: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన సహచర క్రికెటర్‌ను కించపరిచేలా మాట్లాడినందుకు హర్యానాలో అరెస్ట్ అయ్యాడు. లెజెండరీ లెఫ్ట్ హ్యాండ్ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ హర్యానాలోని హిసార్ జిల్లా హన్సిలో అక్టోబర్ 17 ఆదివారం నాడు అరెస్టయ్యాడు. గత సంవత్సరం ఫిర్యాదు చేసిన కేసులో యువరాజ్ కులాన్ని దూషించే పదాలను ఉపయోగించారని ఆరోపణలపై అరెస్టయ్యాడు. ఈమేరకు ఎస్‌-ఎస్టీ అట్రాసిటీ కేసులో యువరాజ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో యువరాజ్‌ను అరెస్టు చేశారు. అయితే, వెంటనే యువరాజ్‌ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

గతేడాది రోహిత్ శర్మతో లైవ్ చాట్‌లో, యుజ్వేంద్ర చాహల్‌ను లక్ష్యంగా చేసుకుని షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా యువరాజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

అయితే, ఈ కేసులో అతనికి వెంటనే బెయిల్ మంజూరు అయింది. హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే యువరాజ్‌ను విడుదల చేశారు. హైకోర్టు ఆదేశించిన తర్వాత యువరాజ్ తన న్యాయవాదులతో హిసార్‌కు చేరుకున్నారు. కొన్ని గంటల విచారణ తర్వాత యువీ చండీగఢ్ వెళ్లాడు.

షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా యువరాజ్ సింగ్ అవమానకరమైన, అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారని ఆరోపించారు. దళిత హక్కుల కార్యకర్త రజత్ కల్సన్ అతనిపై హన్సి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ-ఎస్టీ చట్టంతో పాటు ఐసీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసును రద్దు చేయడానికి యువరాజ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత హైకోర్టు యువరాజ్‌పై పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని నిషేధించింది.

Also Read: T20 World Cup Records: పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరులు వీరే.. ట్రోఫీని గెలిపించడంలో మాత్రం విఫలం

T20 World Cup 2021: మొదటి ఫోర్ నుంచి హాఫ్ సెంచరీ వరకు.. టీ20 ప్రపంచ కప్‌లో తొలి రికార్డులు ఎలా ఉన్నాయంటే?