వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ ఆటగాడు.. భారత్‌పై డబుల్ సెంచరీ చేసి మరీ శిక్షకు గురయ్యాడు.. ఎందుకో తెలుసా?

వివిధ కారణాలతో ఈ ఆటగాడు దాదాపు 30 టెస్ట్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అలా కాకపోయి ఉంటే తన దేశం కోసం 10,000 టెస్ట్ పరుగులు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్ అయ్యేవాడు.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ ఆటగాడు.. భారత్‌పై డబుల్ సెంచరీ చేసి మరీ శిక్షకు గురయ్యాడు.. ఎందుకో తెలుసా?
Former England Batsman Geoffrey Boycott
Follow us

|

Updated on: Oct 21, 2021 | 7:45 AM

England Cricket Team: ఈ బ్యాట్స్‌మన్ ఆటకు తిరుగేలేదు. అతను బ్యాటింగ్ చేయడానికి వచ్చి పరుగులు చేసినప్పుడు, ఆ జట్టును ఓడించడం అసాధ్యమనే భావించేవారు. కానీ, అతను నిత్యం ఏదో వివాదాల్లో కూరుకపోయేవాడు. ఈ కారణంగా అతను చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. క్రికెట్ మైదానంలో, బయట కూడా ఈ వైఖరి కారణంగా ప్రజలు అతన్ని ఇష్టపడలేదు. ఈ క్రికెటర్‌కు స్నేహితుడిగా ఉండేందుకు కూడా ఎవరూ ఇష‌్టపడలేదు. పలు కారణాలతో ఈ ఆటగాడు దాదాపు 30 టెస్ట్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అలా కాకపోయి ఉంటే తన దేశం కోసం 10,000 టెస్ట్ పరుగులు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా మారేవాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఆటగాడి గణాంకాలు అతని సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఆ ఆటగాడు ఎవరంటే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్. ఈరోజు ఆయన పుట్టినరోజు.

జియోఫ్ బాయ్‌కాట్ తన 18 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో 108 టెస్టులు ఆడాడు. 47.72 సగటుతో 8114 పరుగులు చేశాడు. అతని పేరుతో 22 సెంచరీలు, 42 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 36 వన్డేలు కూడా ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, తొమ్మిది అర్ధ సెంచరీల సహాయంతో 1082 పరుగులు చేశాడు. కానీ, బాయ్‌కాట్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో పరుగుల వరద పారించాడు. ఈ ఫార్మాట్‌లో 609 మ్యాచ్‌లలో 56.83 సగటుతో 48,426 పరుగులు చేశాడు. ఈ సమయంలో 151 సెంచరీలు, 238 అర్ధ సెంచరీలు పూర్తి చేశాడు. అతని అత్యధిక స్కోరు 261 నాటౌట్‌గా నిలిచింది. 313 జాబితా ఏ మ్యాచ్‌లలో, జియోఫ్ బాయ్‌కాట్ ఎనిమిది సెంచరీలు, 74 అర్ధ సెంచరీలతో 10,095 పరుగులు చేశాడు.

భారతదేశానికి వ్యతిరేకంగా డబుల్ సెంచరీ కొట్టాడు. 1967 లో భారత్‌తో జరిగిన హెడింగ్లీ టెస్టులో బాయ్‌కాట్ 246 పరుగులు చేశాడు. 555 బంతుల్లో 30 ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఈ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, బాయ్‌కాట్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా పరిగణించడంతో, శిక్షగా జట్టు నుంచి తొలగించారు. అయితే అతని కెరీర్‌లో వివాదాస్పద కారణాల వల్ల బాయ్‌కాట్ నిత్యం వార్తల్లో నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1977 లో హెడింగ్లీలో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. అలాగే తన 100 వ ఫస్ట్ క్లాస్ సెంచరీని కూడా పూర్తి చేశాడు.

జియోఫ్ బాయ్‌కాట్ అర్థం లేని ప్రకటనలు, తప్పుడు కారణాల వల్ల చెడ్డవాడిగ పేరు పొందాడు. కానీ జట్టుకు ఆయన అందించిన సహకారం అమూల్యమైనది. 108 టెస్ట్ కెరీర్‌లో ఇంగ్లండ్ కేవలం 20 మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ల్లో బాయ్‌కాట్ విఫలమవడంతోనే ఓడిపోయాయి. జట్టును ఓటమి నుండి కాపాడటంలో జియోఫ్ బాయ్‌కాట్ ఎప్పుడూ ముందుండేవాడు. ఆటగాడిగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా.. క్రికెట్ వ్యాఖ్యాతగా మారి చాలా సంవత్సరాలు యాక్టివ్‌గానే ఉన్నాడు.

Also Read: T20 World Cup 2021: వార్మప్‌ మ్యాచుల్లో బయటపడ్డ కీలక విషయాలు.. ఆ ప్రశ్నకు సమాధానమే దొరకలే.. కోహ్లీ సేన ఏం చేయనుందో?

Watch Video: మెంటార్‌ ఆన్ డ్యూటీ.. రిషబ్ పంత్‌కు చెమటలు పట్టించిన మిస్టర్ కూల్.. మరో ధోనీ సిద్ధమయ్యాడంటూ నెటిజన్ల కామెంట్లు

T20 World Cup 2021: ఫేవరేట్లుగా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్‌ టీంలు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?