T20 World Cup 2021: ఫేవరేట్లుగా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్‌ టీంలు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?

ఈ ఏడాది టీ 20 ప్రపంచకప్‌ని గెలుచుకోవడానికి ఫేవరేట్‌గా బరిలోకి దిగే టీంలలో పాకిస్తాన్ కూడా ఒకటిగా నిలవనుంది. 11 ఏళ్లుగా దుబాయ్‌లో ఆడుతోన్న పాక్ టీం.. తమ సొంత పిచ్‌లపై ఆడుతోన్నట్లుగా భావిస్తున్నారు.

T20 World Cup 2021: ఫేవరేట్లుగా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్‌ టీంలు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
Icc T20 World Cup
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:28 PM

T20 World Cup 2021: కోవిడ్ అనంతర కాలంలో ప్రపంచ దేశాల మధ్య జరుగుతోన్న మొదటి ఐసీసీ టోర్నమెంట్ కావడంలో అందరి చూపు ఈ టోర్నోపైనే నిలిచింది. భారత్ ఆతిథ్యం ఇస్తోన్న టీ20 ప్రపంచ కప్ 2021.. కోవిడ్ కారణంగా టోర్నీని యూఏఈ, ఓమన్‌లో నిర్వహిస్తున్నారు. అయితే నిరంతరం కోవిడ్ టెస్టులు, బయోబబుల్‌ సంస్కృతిలో, ఆటగాళ్లు త్వరగా అలసిపోవడం అనేది గతంలో కంటే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శారీరకంగా కన్నా మానసిక ఎంతో సవాలుతో కూడుకుంది. 2019 లో 50 ఓవర్ల ప్రపంచ కప్ అనంతరం ఐదేళ్ల తరువాత టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రేక్షకుల మధ్య జరగనుంది. ప్రస్తుతం అగ్రశ్రేణి జట్ల మధ్య అంతరం మునుపటి కంటే చాలా తక్కువగా ఉంది. అన్ని టీంలు హేమాహేమీలుగా కనిపిస్తున్నాయి.

Pakistan Cricket Team

పాకిస్తాన్‌: యూఏఈ పిచ్‌లు పాకిస్తాన్‌కు బాగా అచ్చొచ్చినవి. అందుకే ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ టీంల తో జరిగిన సిరీస్‌లలో మంచి ప్రదర్శన చూపించింది. అలాగే ఈ రెండు దేశాలు పాకిస్తాన్‌లో పర్యటించకుండా సెక్యూరిటీ కారణాలతో సిరీస్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడ్డారు. వారిలో ఏమాత్రం అత్మస్థైర్యం కోల్పోకుండా టీ20 ప్రపంచ కప్‌ బరిలోకి దిగుతున్నారు. అయితే పాకిస్తాన్‌లో పర్యటించేందుకు అన్ని జట్లు సంకోచంలో పడ్డాయి. 2009 లో పాక్‌ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుపై దాడి తరువాత అక్కడ క్రికెట్ ఆడేందుకు అన్ని జట్లు భయపడుతన్నాయి. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ టీం యూఏఈని తమ నివాసంగా చేసుకుంది. దీంతో క్రమంగా అత్యుత్తమ ఆటను కనబరిచి టెస్టుల్లో నంబర్‌ వన్‌గా నిలిచింది. టీ20ల కంటే టెస్ట్‌లు చాలా తక్కువ మందిని ఆకర్షిస్తాయి. ఈ టోర్నమెంట్‌లో 70 శాతం ప్రేక్షకులను అనుమతించడంతో.. పాకిస్తాన్ జట్టు ఈ విషయంలో మరింత మద్దుతుతో ముందుకు సాగనుందని తెలుస్తుంది. పాక్ బోర్డు ప్రెసిడెంట్ ఇటీవల వెల్లడించిన మేరకు, వారి బడ్జెట్‌లో 50 శాతం ఆదాయం ఐసీసీ నుంచే వస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే ఐసీసీకి 90 శాతం ఆదాయం దాదాపు భారతదేశం నుంచే రావడం విశేషం. అందుకే ఐసీసీతోపాటు అన్ని దేశాలు భారత్‌పై ఆధారపడ్డాయనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో పాల్గొననని ఏకైక దేశంగా పాకిస్తాన్ నిలిచింది.

పాకిస్తాన్‌లో కొంతకాలంగా టీ20 చాలా శక్తివంతమైన ఫార్మాట్‌గా నిలిచింది. పీఎస్‌ఎల్‌లో పాక్ ఆటగాళ్లు నిరంతంర క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ టీం టీ 20 ల్లో 3వ స్థానంలో ఉన్నారు. బాబర్ అజామ్-ఎండీ రిజ్వాన్ శకం ప్రారంభమైనప్పటి నుంచి పాక్ పది ద్వైపాక్షిక టీ 20 సిరీస్‌లు ఆడింది. కేవలం మూడు సిరీస్‌ల్లో ఓడిపోయారు. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ టీంలు ఉన్నాయి. యూఏఈలో గత ఐదు సంవత్సరాలలో పాక్ టీం పదకొండు టీ20 లు ఆడారు. వాటిలో ప్రతీదీ గెలిచారు. అందుకే యూఏఈ పిచ్‌లు వారికి అండగా నిలవనున్నాయనేది అక్షర సత్యం.

England Cricket Team (1)

ఇంగ్లండ్: ఇంగ్లండ్ టీం వైట్ బాల్ క్రికెట్‌లో ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో అద్భుతంగా విజయాలు సాధిస్తోంది. 2019 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లండ్ టీం 8 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు ఆడారు. ఇందులో కేవలం ఒకటి మాత్రమే ఓడిపోయారు. అందులో భారత్‌లో ఆడిన సిరీస్‌లో 2-3 తేడాతో కోల్పోయారు. అయితే, ఐపీఎల్‌లో చాలా నెమ్మదిగా ఉండే పిచ్‌లపై వారి ఆట శైలికి సరిపోలేదు. మరోవైపు ఇంగ్లండ్ టీం ప్రస్తుతం గాయాలతో పాటు, ఫాంలో లేని ఆటగాళ్లతో ఇబ్బందులు పడుతోంది. స్టోక్స్, ఆర్చర్ మానసికంగా ఫిట్‌గా లేకపోవడంతో జట్టుకు వారు దూరమయ్యారు. జాసన్ రాయ్, మొయిన్ అలీ మినహా, ఐపీఎల్ సమయంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇంగ్లండ్ టీం కెప్టెన్ మోర్గాన్ మాత్రం తన ఫాంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. తన బ్యాట్ నుంచి పరుగులు రావడంలో తెగ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చాలా మంది సభ్యులు ఈ టోర్నమెంట్ కోసం ఐపీఎల్ లీగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఐపీఎల్ కూడా యూఏఈలోనే జరగడంతో ఇంగ్లండ్ టీం ఆటగాళ్లు ఇక్కడి పిచ్‌లపై ఆడడం వారు మిస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు త్వరగా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడగలరా లేదా అనేది వారి పురోగతిలో అతిపెద్ద సమ్యగా మారనుంది.

Indian Cricket Team (1)

భారత్: భారతదేశం, గత రెండు సంవత్సరాలలో ఆడిన టీ 20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. (శ్రీలంకతో జరిగిన రెండవ టీంతో ఆడిన సిరీస్‌ను మినహాయిస్తే) బెంచ్ బలం ఎంతో నాణ్యమైనదిగా కనిపిస్తోంది. కానీ, పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు. ఎందుకంటే రెండు బ్యాక్-టు-బ్యాక్ టోర్నమెంట్‌లు(ఇంగ్లండ్, ఐపీఎల్‌) ఆడటం వల్ల అనేక కఠిన పరిస్థులను ఎదుర్కొన్నారు. రోహిత్, కోహ్లీ గొప్ప ఫామ్‌లో లేరు. అయితే ఇషాన్ కిషన్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫాంతో తిరిగి వచ్చాడు. మరి ఇషాన్‌ను ఎక్కడ ప్లేస్ చేయనున్నారో తెలియదు. అశ్విన్ టీ20 ప్రపంచ కప్ జట్టులోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చాహల్ ఈ టీంలో లేకపోవడం చాలా విచిత్రంగా కనిపిస్తోంది. శార్దూల్ ఠాకూర్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు. అయితే హార్దిక్ పాండ్యకు బదులుగా ఆక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. కారణం హార్తిక్ బౌలింగ్ చేయకపోవడమే కారణం. టీమిండియా జట్టుకు ఉత్తమ ఎంపికలుగా కేఎల్ రాహుల్, బుమ్రా ఫామ్‌తో పాటు, సూర్యకుమార్ యాదవ్, కిషన్, వరుణ్ చక్రవర్తి నిలిచారు. ఐపీఎల్ సమయంలో మెరిసిన యువ ఆటగాళ్లు జట్టుకు నెట్ సెషన్‌లో బౌలింగ్ ఎంపికలుగా ఎన్నికయ్యారు. హర్షల్ పటేల్, వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వారికి ఇది ఎంతగానో నేర్చుకోవడానికి ఉపయోగపడనుంది. అయితే టీమిండియాకు బాగా కలిసి వచ్చే అంశం ధోని. మెంటార్‌గా భారత జట్టుతో చేరడంతో ఆటగాళ్లకు ఆయన సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Newzealand Cricket Team (1)

న్యూజిలాండ్: న్యూజిలాండ్ జట్టు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఆల్-ఫార్మాట్ జట్టు. టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేత, గత వన్డే ప్రపంచ కప్‌లో రన్నరప్, టీ 20 ల్లో 4వ ర్యాంక్‌తో అద్భుతంగా ముందుకు సాగుతోంది. కివీస్‌కు ఈ ఫార్మాట్ తెలియనిది కాదు. నాలుగు ఐపీఎల్ ప్లేఆఫ్ జట్లలో మూడింటికి కివీస్ కోచింగ్ ఇచ్చారనడంలో ఆశ్చర్యకలగక మానదు. ఎప్పటిలాగే న్యూజిలాండ్ జట్టును తక్కువగా అంచనా వేశారు. చాలామంది సెమీస్‌కు చేరుకుంటారని కూడా ఆశించడం లేదు. కానీ, వారి కీలక ఆటగాళ్లలో కొందరు ఐపీఎల్‌లో మంచి ప్రాక్టీస్ దొరికింది. కివీస్ జట్టులో నాణ్యత, వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. కివీస్ చివరి 10 టీ 20 సిరీస్‌లలో 7 గెలిచారు. (అయితే రెండవ జట్టుతో ఇటీవలి బంగ్లా పర్యటనను లెక్కించలేదు). గాయాలు లేకుంటే ఈ ప్రస్తుత జట్టు కాగితంపై చాలా బలంగా ఉంటుంది.

Westindies Cricket Team (1)

వెస్టిండీస్: వెస్టిండీస్ టీం డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నారు. కానీ, ఐదు సంవత్సరాల తరువాత ఆశ్చర్యకరంగా టీ 20 ల్లో 9 వ స్థానంలో నిలిచారు. క్రికెట్ చరిత్రలో ఏ జట్టులోనూ లేని అత్యంత శక్తిమంతమైన పవర్ హిట్టర్‌లను కలిగి ఉన్నప్పటికీ ఎప్పుడు ఏంచేస్తుందో తెలియదు. విండీస్ చివరి 11 టీ 20 సిరీస్‌లలో కేవలం 3 మాత్రమే గెలిచింది. వీరింతా ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు. విండీస్ టీంకు సరైన నాయకత్వం లోపం కూడా ఉంది. అందులోనూ వీరంతా సమిష్టిగా ఆడడంలో విఫలమవుతున్నారు. రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ గెలుచుకున్న ఏకైక జట్టుగా విండీస్ టీం నిలిచింది. ఈ జట్టులో నరైన్ లేకపోవడం ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమే. యో-యో పరీక్షలో ఉత్తీర్ణత సాధించనందున అతను జట్టులో చోటు దక్కించుకోలేదు. విండీస్ టీం తమ పవర్-హిట్టింగ్‌‌తో పాటు వారి లోతైన బ్యాటింగ్ ఆర్డర్‌ని మరింత సానుకూల మనస్తత్వాన్ని సరైన వ్యూహంలోకి తీసుకొస్తే సెమీస్ చేరడం వీరికి అంత పెద్ద విషయం కాదు.

Southafrica Cricket Team (1) (1)

దక్షిణాఫ్రికా: ఈ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా టీం కూడా కనీసం సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి కూడా నానా తంటాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. జట్టులో చాలామంది మంచి ప్లేయర్లు ఉన్నా.. ఆజట్టుకు లక్ కలిసిరాదు. ఇది వరకు చూపిన మ్యాచ్ ఫలితాలతో ఇది తెలుస్తోంది. దక్షిణాఫ్రికా టీం చివరిసారిగా ఆడిన ఆరు టీ20 పర్యటనలలో ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాను ఓడించారు. దక్షిణాప్రికా టీం హోమ్ రికార్డ్ చాలా దారుణంగా ఉంది. కానీ, వారి కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌లో మంచి ప్రాక్టీస్ లభించింది. దీంతో వారికి ఇక్కడ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కొన్ని ఇతర జట్ల మాదిరిగానే దక్షిణాఫ్రికా జట్టు ఏ రోజైనా చాలా ప్రమాదకరమైనదిగా మారొచ్చు.

Australia Cricket Team (1)

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా టీం కూడా గత కొంతకాలంగా ఈఫార్మాట్‌లో తెగ ఇబ్బంది పడుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు టీ 20 సిరీస్‌లలో కేవలం ఒక్కటే గెలిచారు. దీంతో ఆ జట్టు 7వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫాం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. స్మిత్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే ఐపీఎల్‌లో మెరిసిన గ్లెన్ మాక్స్‌వెల్ భుజాలపైనే వారి విజయాలు నిలిచి ఉన్నాయి. మాక్స్‌వెల్ ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు. తన స్ట్రైక్ రేట్ తగ్గకుండా ప్రతి ఇన్నింగ్స్‌లోనూ పరుగులు సాధిస్తాడు. అయితే ఎప్పుడు ఫాంలో ఉంటాడనేది తెలియదు. అదే ఆసీస్ జట్టుకు భయంగా మారింది.

బంగ్లాదేశ్ టీం టీ20 ర్యాకింగ్స్‌లో 6వ , అఫ్ఘనిస్తాన్ 8వ, శ్రీలంక 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. వీటిపై చాలామందికి అంచనాలు కూడా లేదు. కానీ, తమదైన రోజున ప్రత్యర్థి టీంలకు చుక్కలు చూపిస్తుంటాయి.

ఈ టోర్నమెంట్‌లో బిగ్ త్రీ ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కాకుండా మరొకరు గెలిస్తే చూడాలని కొంతమంది కోరుకుంటున్నారు. అయితే పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో కూడిన సెమీఫైనల్ లైనప్ కూడా చాలా క్లిష్టంగా ఉండనుంది. అయితే యూఏఈలోని పిచ్‌లు అన్ని సెకండ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉన్నాయి. టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వారి చేతులోకి పోయే అవకాశం ఉండడంతో యూఏఈలో టాస్‌ కీలకంగా మారనుంది. మరో ఐదు నెలల్లో భారతదేశంలో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది. పేరుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్నా.. యూఏఈలో మ్యాచులు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌కు సొంత పిచ్‌లుగా ఉండడంతో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, మ్యాక్స్‌వెల్ ప్రతిభతో ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా.. కొత్త దేశంలో జరిగే టీ20 ప్రపంచకప్‌ 2021లో విజేతగా ఎవరు నిలుస్తారో చూసేందుకు యావత్ ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

Also Read: Virat Kohli: విరుష్క ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే.. ఫ్యామిలీ ఫొటోలో వామికా ఫేస్ మిస్.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారంటూ కామెంట్లు

T20 World Cup: మ్యాచ్ జరగాల్సిందే.. యువకులు రాణిస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు.. దాయాదుల పోరుపై కపిల్ కీలక వ్యాఖ్యలు