Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: ఆస్ట్రేలియాపై చెలరేగిన రోహిత్‌ శర్మ.. ఫోర్లు, సిక్స్‌లతో దుమ్ములేపాడు..

T20 World Cup 2021: టీ 20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌ ఆడటానికి భారత్‌కి ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 24 ఆదివారం

T20 World Cup 2021: ఆస్ట్రేలియాపై చెలరేగిన రోహిత్‌ శర్మ.. ఫోర్లు, సిక్స్‌లతో దుమ్ములేపాడు..
Rohit Sharma
Follow us
uppula Raju

|

Updated on: Oct 20, 2021 | 9:27 PM

T20 World Cup 2021: టీ 20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌ ఆడటానికి భారత్‌కి ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 24 ఆదివారం భారత జట్టు ప్రధాన ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకి ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆడే అవకాశం లభించింది. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో కూడా భారత్ మంచి ప్రదర్శన కనబరిచి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మరోసారి భారత జట్టు బలమైన బ్యాటింగ్ శైలిని చూపింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చక్కటి అర్ధ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసాన్ని చాటింది. అదే సమయంలో పాకిస్తాన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ ఎంట్రీ ఇచ్చాడు.

5 ఫోర్లు, 3 సిక్సర్లు కెఎల్ రాహుల్‌తో ఓపెనింగ్‌కి దిగిన రోహిత్ శర్మ మొదటి 30 బంతుల్లో కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత 31 వ బంతికి ఒక సిక్స్ కొట్టాడు అక్కడి నుంచి కేవలం 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ 41 బంతులను ఎదుర్కొన్నాడు. 5 ఫోర్లు 3 భారీ సిక్సర్‌ల సహాయంతో 60 పరుగులు చేశాడు తర్వాత పెవిలియన్‌కు చేరాడు.

రోహిత్ ఇన్నింగ్స్ వల్ల పాకిస్తాన్‌కి ఇబ్బందే.. రోహిత్ ఇన్నింగ్స్ టీమ్ ఇండియాకు గొప్ప ఉపశమనం కలిగిస్తే పాకిస్తాన్ జట్టుకి ఇబ్బంది కలిగించే విషయమని చెప్పవచ్చు. రోహిత్ ఇంతకు ముందు 2019 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై సెంచరీ సాధించాడు. మళ్లీ ఇప్పుడు పాకిస్థాన్‌పై ఆడబోతున్నాడు.

NTA CUCET Result 2021: సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

Big News Big Debate: హద్దులు మీరుతున్న మాటలు.. రణరంగంగా మారిన ఏపీ రాజకీయం..

Viral News: సాక్స్ ఆర్డర్ చేశాడు.. డెలివరీ ఐటమ్ ఓపెన్‌ చేస్తే షాకే.. ఇంతకీ ఏమొచ్చిందంటే!