Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: హద్దులు మీరుతున్న మాటలు.. రణరంగంగా మారిన ఏపీ రాజకీయం..

మాటలు హద్దులు మీరి.. చట్టం చేతిలోకి రావడంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా రణరంగాన్ని తలపిస్తోంది. పోటాపోటీ ఆందోళనలు, ధర్నాలతో..

Big News Big Debate: హద్దులు మీరుతున్న మాటలు.. రణరంగంగా మారిన ఏపీ రాజకీయం..
Ap Politics
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 21, 2021 | 8:32 PM

మాటలు హద్దులు మీరి.. చట్టం చేతిలోకి రావడంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా రణరంగాన్ని తలపిస్తోంది. పోటాపోటీ ఆందోళనలు, ధర్నాలతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారింది. అటు నేతల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరి హైవొల్టేజ్‌ పాలిటిక్స్‌ మొదలయ్యాయి. ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనంటూ తమ్ముళ్లు డిమాండ్‌ చేస్తుంటే.. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీనే బ్యాన్‌ చేయాలంటున్నారు వైసీపీ నాయకులు. దీక్షకు దిగుతున్న చంద్రబాబు.. ఢిల్లీదాకా తీసుకెళతామంటుంటే.. సీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాక తేల్చుకోమంటున్నారు మంత్రులు. అటు ఇతర ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడాన్ని అధికారపార్టీ ప్రశ్నిస్తోంది.

పట్టాభి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు APలో పెనుదుమారం రేపుతున్నాయి. టీడీపీ బంద్‌, వైసీపీ నిరసనలతో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ పిలుపునిచ్చిన బంద్‌ పాక్షికంగానే సక్సస్‌ అయినా.. జిల్లాల్లో నేతల ఇళ్ల వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆర్టికల్‌ 356 పెట్టాలంటోంది టీడీపీ. సీఎంపై అసభ్యంగా మాట్లాడి అల్లర్లకు కారణమైన తెలుగుదేశం పార్టీనే బ్యాన్ చేయాలంటోంది వైసీపీ.

మరోవైపు దాడులకు నిరసనగా 36గంల దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ముందు సీఎంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి కొంగజపం చేసినా తమకు ఇబ్బంది లేదంటూ మంత్రులు వ్యాఖ్యానించారు. అరాచకం రాజ్యమేలుతుందంటూ బ్రాండిండ్‌ చేసే కుట్ర ఉందని.. ఇందులో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అంటున్నారు మంత్రి కన్నబాబు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆర్గనైజ్డ్‌ కుట్ర అంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని పరిశీలించింది సీపీఐ, అటు జనసేన బీజేపీలు సైతం ఖండించాయి. అధికారపార్టీ ఆర్గనైజ్డ్‌ దాడిగానే ఆరోపించింది లెఫ్ట్ పార్టీ. ఇది దాడే కాదని.. ప్రజల నుంచి వచ్చిన రియాక్షన్ అంటున్న వైసీపీ మద్దతిచ్చిన పార్టీలపై మండిపడుతున్నాయి. నాడు ముద్రగడ ఇంటిపై తెలుగుదేశం ఆదేశాలతో పోలీసులు వెళ్లి విధ్వంసం చేస్తే ఈ పార్టీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందడానికే టీడీపీకి మద్దతిస్తున్నాయన్నారు. మొత్తానికి పట్టాబి వ్యాఖ్యల నుంచి మొదలైన దుమారం కంటిన్యూ అవుతోంది. పరస్పర కేసులతో ప్రస్తుతానికి పోలీసులకు వద్దకు చేరింది. మరి అంతిమంగా ఇందులో ఎవరు అరెస్టు అవుతారు.. మరెన్ని మలుపులు తిరుగుతుందన్నది చూడాలి.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.