Viral News: సాక్స్ ఆర్డర్ చేశాడు.. డెలివరీ ఐటమ్ ఓపెన్ చేస్తే షాకే.. ఇంతకీ ఏమొచ్చిందంటే!
ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని జనాలు ఏది కావాలన్నా...
ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని జనాలు ఏది కావాలన్నా బయటకు వెళ్లక్కర్లేకుండానే ఇంటి దగ్గర నుంచి ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో తాము ఆర్డర్ చేసిన వస్తువులు కాకుండా వేరే వేరే వస్తువులు డెలివరీ కావడంతో వినియోగదారులకు షాకులతో పాటు ఇబ్బందులు కూడా తప్పడం లేదు.
తాజాగా ఓ వ్యక్తి ఫుట్‌బాల్ స్టాకింగ్స్ అంటే పొడవైన సాక్స్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. ఆర్డర్ డెలివరీ అయ్యాక చూస్తే అందులో సాక్స్‌లకు బదులు నల్లని బ్రా ఉంది. అది ట్రయంప్ బ్రాండ్ నేమ్‌తో ఉంది. వెంటనే అతను సదరు కస్ట్‌మర్ కేర్‌కి కాల్ చేశాడు. అయితే ఆ సంస్థవాళ్లు డెలివరీ అయిన ఐటమ్‌ని మార్చడం కుదరదని చెప్పారట.
This tweet has garnered 300,000 impressions in less than 48 hours. Here’s how I did it (1/n) https://t.co/GPyfj9gtLf
— Kashyap (@LowKashWala) October 18, 2021
దాంతో ఈ విషయాన్ని సదరు వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఐటమ్ మార్చమంటే ” క్షమించండి.. అది మార్చలేం” అంటూ రిప్లై ఇచ్చిందంటూ క్యాప్షన్ కూడా రాశారు. దీంతో ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది. వెంటనే స్పందించిన సదరు కంపెనీ సమాధానమిస్తూ “జరిగిన పొరబాటుకు క్షమాపణ చెబుతున్నాం. దీనిపై మీరు తగిన నిర్ధారణ ఇవ్వండి. మా మేనేజర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు అప్ డేట్ ఇస్తారు.. మీరు సహనంతో ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చింది.
Ordered football stockings. Received a triumph bra. @myntra‘s response? “Sorry, can’t replace it”.
So I’m going to be wearing a 34 CC bra to football games, fellas. Ima call it my sports bra. pic.twitter.com/hVKVwJLWGr
— Kashyap (@LowKashWala) October 17, 2021
కాగా, దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. తాము కూడా ఒకటి అడిగితే మరొకటి పొందిన సందర్భాలు ఉన్నాయని రిప్లైలు ఇస్తున్నారు. మొత్తానికి ఈ వినియోగదారు చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఇప్పటికే వేల మంది దాన్ని లైక్ చేస్తూ, రీ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.