Anand Mahindra: వామ్మో ఇదేంది.. ‘డ్రైవర్ లెస్ బైక్’ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా.. నెటిజన్ల పరేషాన్..
Anand Mahindra tweet: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో
Anand Mahindra tweet: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని వీడియోలపై మహింద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహింద్రా.. తరచూ రియాక్ట్ అవుతుంటారు. తాజాగా ఓ వీడియోపై కూడా ఆనంద్ మహింద్రా రియాక్ట్ అయ్యారు. దానిని షేర్ చేసి.. భిన్నమైన కామెంట్లను చేశారు. డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపైకి వస్తున్న తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఓ వ్యక్తి బైక్ వెనకాల కూర్చుని ఉండగా.. అది వేగంగా ముందుకు వెళ్తుంటుంది. అతను బైక్‌పై ఓ పక్కన కూర్కొని సరదగా రోడ్డు వెంట ఉన్నవారికి చేయి ఊపుతుంటాడు. ఈ ఘటనను మరో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వీడియో తీశాడు. డ్రైవర్ లెస్ వాహనాలతో భారత్‌కు తెద్దామనుకున్న ఎలన్ మస్క్‌కు.. దీనితో కాంపీటీషన్ పెరుగుతుంది కావచ్చు అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చి ట్విటర్‌లో షేర్ చేశాడు. దీనిని మహింద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహింద్రా.. షేర్ చేసి.. దిగ్గజ గాయకుడు కిశోర్‌కుమార్ పాడిన ‘ముసాఫిర్ హోన్ యారాన్’ పాటను వీడియోకు ఆపాదించారు. ”ముసాఫిర్ హోన్ యారాన్.. నా చాలక్ హై, నా ఠికానా హై” అంటూ రీట్వీట్ చేశారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించి పలు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
వీడియో..
Elon Musk: I want to bring driverless vehicles to India.
Meanwhile India… pic.twitter.com/9YSFg0bYkW
— Dr. Ajayita (@DoctorAjayita) October 19, 2021
అయితే ఈ వీడియోను చూసిన వారంతా షాకవుతున్నారు. ఎవరూ నడపకుండా బైక్ ఎలా వేగంగా వెళ్తుందంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. గ్రేట్ రైడింగ్ స్కిల్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తూనే.. మన రోడ్లపై ఇలాంటి స్టంట్లు వద్దంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు కనీసం హెల్మెట్ లేకుండా బైక్‌పై విన్యాసాలు చేస్తున్న ఇలాంటి వీడియోలను ప్రమోట్ చేయొద్దంటూ ఆనంద్ మహింద్రాకు సూచిస్తున్నారు. ఇలాంటి పనుల వల్లే దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ విమర్శిస్తున్నారు. ఏదీఏమైనప్పటికీ.. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. బైక్‌పై అతను కూర్కొని ఫొజులిస్తున్న తీరును చూసి పలువురు షాకవుతున్నారు.
Also Read: