Test Cricket: తొలి బంతికే సిక్స్.. అది కూడా టెస్ట్ మ్యాచ్‌లో.. దిగ్గజాలకే సాధ్యం కాలే.. లిస్టులో ఒకే ఒక్కడు.. ఎవరంటే?
Cricket Facts: టెస్టు క్రికెట్ చరిత్రలో వివియన్ రిచర్డ్స్, వీరేంద్ర సెహ్వాగ్, మాథ్యూ హేడెన్, డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్, బ్రెండన్ మెకల్లమ్ లాంటి తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కానీ తొలి బంతికే సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో ఎవరున్నారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారంతే.
First Ball Six In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్ర సుమారు 146 సంవత్సరాల నాటిది. 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. దాదాపు 146 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నో భారీ, అపురూపమైన రికార్డులు నమోదయ్యాయి. అయితే టెస్టు మ్యాచ్‌లో తొలి బంతికే సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్స్ ఉన్నారని తెలుసా? అవును.. టెస్టు క్రికెట్‌లో తొలి బంతికే సిక్సర్లు బాదిన ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నాడు. ఆయనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
టెస్టు క్రికెట్ చరిత్రలో వివియన్ రిచర్డ్స్, వీరేంద్ర సెహ్వాగ్, మాథ్యూ హేడెన్, డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్, బ్రెండన్ మెకల్లమ్ లాంటి తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కానీ తొలి బంతికే సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో ఎవరున్నారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారంతే. నిజానికి 146 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్కసారి మాత్రమే జరిగింది.
ఈ లిస్టులో ‘యూనివర్స్ బాస్’ ఒక్కడే..
యూనివర్స్ బాస్‌గా పేరుగాంచిన క్రిస్ గేల్ ఈ ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో మ్యాచ్ తొలి బంతికే సిక్సర్ బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. 2012లో క్రిస్ గేల్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్‌తో తలపడింది. బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్ ఆఫ్ స్పిన్నర్ చేసేందుకు సోహాగ్ ఘాజీ వచ్చాడు. మ్యాచ్ తొలి బంతికే క్రిస్ గేల్ సిక్సర్ బాదాడు. ఇక సోహగ్ ఘాజీ వేసిన తొలి ఓవర్లో యూనివర్స్ బాస్ 18 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, దాదాపు 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి మ్యాచ్‌లో తొలి బంతికే ఓ బ్యాట్స్‌మెన్ సిక్సర్ బాదడం ఇదే తొలిసారి.
క్రిస్ గేల్ కెరీర్..
వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ తన వేగవంతమైన బ్యాటింగ్‌తో ‘యూనివర్స్ బాస్’ అని పిలుస్తుంటారు. వెస్టిండీస్ కోసం అంతర్జాతీయ మ్యాచ్‌లే కాకుండా, ఈ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్‌తో సహా అనేక లీగ్‌లలో అభిమానులను ఎంతగానో అలరించాడు. వెస్టిండీస్ తరపున క్రిస్ గేల్ 103 టెస్టుల్లో 42.19 సగటుతో 7215 పరుగులు చేశాడు. 301 అంతర్జాతీయ వన్డేల్లో 10480 పరుగులు చేశారు. ఇది కాకుండా 79 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 137.51 స్ట్రైక్ రేట్‌తో 1899 పరుగులు నమోదయ్యాయి. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో క్రిస్ గేల్ అత్యుత్తమ స్కోర్లు వరుసగా 333, 215, 117 పరుగులుగా ఉన్నాయి. మరోవైపు క్రిస్ గేల్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఈ ఆటగాడు 142 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 4965 పరుగులు చేశాడు. ఈ సమయంలో, యూనివర్స్ బాస్ ఉత్తమ స్కోరు 175గా నిలిచింది. సగటు, స్ట్రైక్ రేట్ వరుసగా 39.72, 148.96గా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..