FIH Hockey WC 2023: హాట్‌ కేకుల్లా అమ్ముడైన టికెట్లు.. హాకీ ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఎప్పటినుంచంటే?

FIH Hockey World Cup Tickets: భారత్‌లో హాకీ ప్రపంచకప్‌ ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రూర్కెలా వేదికగా జరగనున్న ప్రపంచకప్‌ మ్యాచ్‌లన్నింటి టిక్కెట్లు వారం రోజుల్లోపే అమ్ముడవ్వడం విశేషం.

FIH Hockey WC 2023: హాట్‌ కేకుల్లా అమ్ముడైన టికెట్లు.. హాకీ ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఎప్పటినుంచంటే?
Fih Hockey World Cup 2023
Follow us
Venkata Chari

|

Updated on: Dec 26, 2022 | 6:45 AM

భారతదేశంలో హాకీ ప్రపంచ కప్ ఆడటానికి కొన్ని రోజులు మిగిలి ఉంది. ఈ టోర్నీ సమీపిస్తున్న కొద్దీ హాకీ అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈసారి ప్రపంచకప్‌ను ఒడిశాలోని భువనేశ్వర్‌, రూర్కెలాలో నిర్వహించనున్నారు. భారత్‌లో జరగనున్న హాకీ ప్రపంచకప్ జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచం నలుమూలల నుంచి 16 ఎలైట్ టీమ్‌లు ఈ పోటీలో పాల్గొంటాయి. ఈ సమయంలో, రూర్కెలాలో డిసెంబర్ 19 నుంచి టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. అయితే, వారంలోనే అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

భారత్‌లో తొలిసారి హాకీ ప్రపంచకప్..

ఒడిశాలోని రౌల్కెలాలో తొలిసారి ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక్కడ డిసెంబర్ 19న, కొత్తగా నిర్మించిన బిర్సా ముండా హాకీ స్టేడియం వెలుపల పెద్ద సంఖ్యలో హాకీ అభిమానులు గుమిగూడారు. దీంతో వారం రోజుల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. గత కొన్నేళ్లుగా అభిమానుల్లో హాకీపై ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు.

రూర్కెలాలో 20 మ్యాచ్‌లు..

హాకీ ప్రపంచకప్‌లోని 20 మ్యాచ్‌లు రూర్కెలాలో నిర్మించిన కొత్త బిర్సా ముండా స్టేడియంలో జరుగుతాయి. ఈ స్టేడియంలో 20 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. కాగా భువనేశ్వర్‌లోని ప్రసిద్ధ కళింగ స్టేడియంలో 15 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. ప్రపంచకప్‌లో 24 మ్యాచ్‌లు కళింగ స్టేడియంలో జరగనున్నాయి. ఇందులో క్వార్టర్-ఫైనల్, సెమీ-ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్స్ వంటి ముఖ్యమైన మ్యాచ్‌లు ఉన్నాయి. పూల్ డిలో భారత్‌కు స్థానం లభించింది.

ఇవి కూడా చదవండి

టీమిండియా షెడ్యూల్ ఇదే..

పూల్ డిలో భారత జట్టు చోటు దక్కించుకుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను జనవరి 13న రూర్కెలాలో స్పెయిన్‌తో ఆడనుంది. ఆ తర్వాత జనవరి 15న ఇదే మైదానంలో ఇంగ్లండ్‌తో భారత జట్టు రెండో మ్యాచ్‌ ఆడనుంది. భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌ని వేల్స్‌తో జనవరి 19న భువనేశ్వర్‌లో ఆడనుంది. ఆస్ట్రేలియా, బెల్జియం, నెదర్లాండ్స్, ఇండియా, అర్జెంటీనా, జర్మనీ, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, కొరియా, మలేషియా, స్పెయిన్, దక్షిణాఫ్రికా, జపాన్, చిలీ, వేల్స్ సహా 16 జట్లు ఈ ప్రపంచకప్‌లో పాల్గొంటాయి.

టిక్కెట్ల ధర ఎంత ఉందంటే?

ఇండియా మ్యాచ్ రోజున వెస్ట్ స్టాండ్‌లో కూర్చుంటే రూ.500, ఈస్ట్ స్టాండ్‌లో కూర్చుంటే రూ.400, నార్త్ స్టాండ్‌లో కూర్చుంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఇండియా మ్యాచ్ లేని రోజు వెస్ట్ స్టాండ్‌లో కూర్చుంటే రూ.500, ఈస్ట్ స్టాండ్‌లో కూర్చుంటే రూ.200, నార్త్ స్టాండ్‌లో కూర్చుంటే రూ.100 ఫీజు వసూలు చేయనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..