AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : 48 జట్లు.. ఒకే ఒక్క ట్రోఫీ.. ఆ ఒక్క రోజు కోసం ప్రపంచమంతా వెయిటింగ్!

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచంలో ఈ ఇద్దరు దిగ్గజాలు మైదానంలో ముఖాముఖి తలపడితే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026లో మెస్సీ వర్సెస్ రొనాల్డో మ్యాచ్ ఎప్పుడు ఉంటుంది? అని అందరూ గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

FIFA World Cup 2026 :  48 జట్లు.. ఒకే ఒక్క ట్రోఫీ.. ఆ ఒక్క రోజు కోసం ప్రపంచమంతా వెయిటింగ్!
Fifa World Cup 2026
Rakesh
|

Updated on: Jun 03, 2026 | 5:09 PM

Share

FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌కు సమయం ఆసన్నమైంది. జూన్ 12 నుంచి ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నడూ లేని విధంగా ఏకంగా 48 దేశాల జట్లు కప్పు కోసం తలపడబోతున్నాయి. దీంతో ఈసారి పోటీ మరింత రసవత్తరంగా, హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, అభిమానులందరి కళ్ళు మాత్రం ఈ జట్లు అన్నింటి కంటే ఎక్కువగా ఫుట్‌బాల్ లెజెండ్స్ లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోల పైనే ఉన్నాయి.

జూలై 11 న చారిత్రాత్మక పోరు సాధ్యమేనా?

ఫుట్‌బాల్ ప్రపంచంలో ఈ ఇద్దరు దిగ్గజాలు మైదానంలో ముఖాముఖి తలపడితే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026లో మెస్సీ వర్సెస్ రొనాల్డో మ్యాచ్ ఎప్పుడు ఉంటుంది? అని అందరూ గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం, అర్జెంటినా, పోర్చుగల్ జట్లు జూలై 11వ తేదీన క్వార్టర్ ఫైనల్స్‌లో ఒకరినొకరు ఢీకొట్టే అవకాశం ఉంది. కానీ ఈ చారిత్రాత్మక మ్యాచ్ జరగాలంటే మాత్రం ఇరు జట్లు ఒక ప్రత్యేకమైన సమీకరణాన్ని దాటాల్సి ఉంటుంది.

గ్రూప్ స్టేజ్ సమీకరణాలు ఇవే

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. లీగ్ దశలో అర్జెంటినా, పోర్చుగల్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. అర్జెంటినా జట్టు గ్రూప్ జెలో ఉండగా, పోర్చుగల్ జట్టు గ్రూప్ కెలో స్థానం సంపాదించింది. అందువల్ల గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో ఈ ఇరు జట్లు తలపడే అవకాశం అస్సలు లేదు. అయితే, రెండు జట్లు తమ తమ గ్రూపులలో టాపర్స్‌గా నిలిచి, ఆ తర్వాత రౌండ్‌లలో విజయం సాధిస్తే.. జూలై 11న జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో మెస్సీ, రొనాల్డో నేరుగా మైదానంలో యుద్ధానికి దిగే ఛాన్స్ గట్టిగా ఉంది.

ఆరో ప్రపంచకప్‌తో అరుదైన రికార్డు

ఈ 2026 ప్రపంచకప్ మైదానంలోకి అడుగుపెట్టగానే మెస్సీ, రొనాల్డో ఇద్దరూ ఒక సరికొత్త చారిత్రాత్మక రికార్డును తమ పేరిట లిఖించుకోనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఇది కెరీర్‌లో ఆరో ఫిఫా ప్రపంచకప్ కావడం విశేషం. ప్రపంచ క్రికెట్ లేదా ఫుట్‌బాల్ చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం టాప్ ఫామ్‌లో కొనసాగుతూ ఆరు వరల్డ్ కప్‌లు ఆడటం ఎవరికైనా అరుదైన విషయమనే చెప్పాలి. ఒక రకంగా ఈ ఇద్దరి భీకరమైన ఫామ్, ఆట పట్ల వారికున్న అంకితభావానికి ఇది నిదర్శనం.

దిగ్గజాలకు ఇదే చివరి వరల్డ్ కప్ కానుందా?

ప్రస్తుతం లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఇద్దరి వయసు పైబడుతోంది. అందువల్ల 2026 లో జరిగే ఈ ఫిఫా టోర్నమెంట్‌ కచ్చితంగా వీరి కెరీర్‌లో చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 11న గనుక అర్జెంటినా, పోర్చుగల్ మ్యాచ్ ఫిక్స్ అయితే.. ఆ మ్యాచ్‌కు ఉండే హైప్, క్రేజ్ అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలోనే మునుపెన్నడూ చూడని రేంజ్‌లో ఉంటుంది. తమ అభిమాన ఆటగాళ్లను వరల్డ్ కప్ వేదికపై చివరిసారిగా తలపడగా చూడాలని ఫ్యాన్స్ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us