IND vs ENG 4th Test: టాస్ ఓడిన భారత్.. రెండో బుమ్రా అరంగేట్రం.. 3 మార్పులతో బరిలోకి
England vs India, 4th Test: 5 టెస్ట్‌ల సిరీస్‌లో టీం ఇండియా 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్ట్ లో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది.

Anshul Kamboj Debut: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ తన టెస్ట్ అరంగేట్రం చేస్తున్నాడు. మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దీప్ దాస్‌గుప్తా అతనికి టెస్ట్ క్యాప్ అందించారు.
5 టెస్ట్‌ల సిరీస్‌లో టీం ఇండియా 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్ట్ లో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది.
మూడో టెస్ట్‌కు రెండు రోజుల ముందు సోమవారం, ఇంగ్లాండ్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను విడుదల చేసింది. జట్టులో ఒకే ఒక మార్పు జరిగింది. గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ లియామ్ డాసన్ కు అవకాశం లభించింది. మిగిలిన 10 మంది ఆటగాళ్ళు లార్డ్స్ టెస్ట్ లో ఆడిన వారే.
రెండు జట్ల ప్లేయింగ్-ఎలెవన్:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్.
ఇంగ్లాండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (w), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




