AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

W,W,W,W,W,W,W,W,W,W.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కట్‌చేస్తే.. మాంచెస్టర్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా ప్లేయర్

Anshul Kamboj Debut: హర్యానా తరపున 24 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు తీసి విజయవంతమైన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ముగించిన కాంబోజ్, బ్యాటింగ్‌లో కూడా తన సత్తా చాటాడు. ముఖ్యంగా నాటింగ్‌హామ్‌లో ఇండియా ఏ జట్టును డ్రాగా ముగించడంలో తనూష్ కోటియన్‌తో కలిసి అజేయంగా 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గత సీజన్‌లో రంజీ ట్రోఫీలో కేరళపై ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి కాంబోజ్ వార్తల్లో నిలిచాడు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఆరో భారతీయుడిగా అతను నిలిచాడు.

Venkata Chari
|

Updated on: Jul 23, 2025 | 3:42 PM

Share
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉండగా, కంబోజ్ ఎంపిక జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

1 / 5
భారత్ ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉంది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలైన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఈ నాలుగో టెస్టు "డూ ఆర్ డై" మ్యాచ్‌గా మారింది. ఇలాంటి కీలక సమయంలో అరంగేట్రం చేసిన కంబోజ్‌పై అందరి దృష్టి నెలకొంది.

2 / 5
అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ వంటి కీలక పేసర్లు గాయాల బారిన పడటంతో, హర్యానాకు చెందిన 24 ఏళ్ల అన్షుల్ కంబోజ్‌కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో కంబోజ్ సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత రంజీ ట్రోఫీ సీజన్‌లో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అతని ఆల్ రౌండర్ నైపుణ్యాలు, బ్యాటింగ్‌లో కూడా రాణించగల సామర్థ్యం, జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తాయి.

3 / 5
ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ సాధారణంగా పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బంతి బౌన్స్, స్వింగ్ ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా మేఘావృత వాతావరణంలో పేసర్లు రాణిస్తారు. వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నందున, పేసర్లు ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లతో పాటు, అన్షుల్ కంబోజ్ భారత పేస్ అటాక్‌లో పదును పెంచుతాడని టీమిండియా ఆశిస్తోంది.

4 / 5
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్‌కు రికార్డు అంతగా బాగాలేదు. ఇక్కడ ఆడిన తొమ్మిది టెస్టుల్లో ఒక్కటి కూడా గెలవలేదు. నాలుగు ఓడిపోయి, ఐదు డ్రా అయ్యాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత భారత్ ఇక్కడ టెస్టు మ్యాచ్ ఆడుతోంది. గత రికార్డులను పక్కనపెట్టి, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని గిల్ సేన దృఢ నిశ్చయంతో ఉంది. అన్షుల్ కంబోజ్ అరంగేట్రం భారత జట్టుకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

5 / 5
Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి

గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్