AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs NZ: 21 ఇన్నింగ్స్‌లు.. 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో బీభత్సం.. వరల్డ్ కప్‌లో డేంజరస్ ప్లేయర్ ఇతనే..

England vs New Zealand, Dawid Malan: భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో డేవిడ్ మలన్ కూడా ఉన్నాడు. అతని ఫామ్ చూస్తుంటే భారత పిచ్‌లపై ప్రత్యర్థి జట్ల బౌలర్లకు పెద్ద సమస్యగా మారవచ్చు. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 5న న్యూజిలాండ్‌తో ఆడనుంది.

ENG vs NZ: 21 ఇన్నింగ్స్‌లు.. 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో బీభత్సం.. వరల్డ్ కప్‌లో డేంజరస్ ప్లేయర్ ఇతనే..
Dawid Malan
Venkata Chari
|

Updated on: Sep 15, 2023 | 10:04 PM

Share

England vs New Zealand, 4th ODI: ప్రస్తుతం ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య 4 వన్డేల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఎడమచేతి వాటం ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలాన్‌ బ్యాట్‌ నుంచి 114 బంతుల్లో 127 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌ కనిపించింది. మలన్ వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి, అతను 50 ఓవర్ల ఫార్మాట్‌లో బ్యాటింగ్‌తో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు.

డేవిడ్ మలన్ ఇప్పటివరకు 21 వన్డే ఇన్నింగ్స్‌లలో బరిలోకి దిగి 61.53 సగటుతో 1088 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 5 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు వచ్చాయి. దీంతో వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ తరపున అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మార్కును దాటిన ఆటగాడిగా మలన్ నిలిచాడు. అంతకుముందు, T20 ఇంటర్నేషనల్‌లో కూడా, డేవిడ్ మలన్ 24 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేసిన ఇంగ్లండ్ తరపున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా పేరుగాంచాడు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ తరువాత ఒక ఎండ్ నుంచి వికెట్లు పడిపోతున్నా.. మలన్ మరో ఎండ్ నుంచి ఇన్నింగ్స్‌ను చూపట్టి పరుగుల వేగాన్ని కొనసాగించాడు. మలన్ ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది.

వన్డే ప్రపంచకప్ జట్టులో చేరిన మలన్..

భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో డేవిడ్ మలన్ కూడా ఉన్నాడు. అతని ఫామ్ చూస్తుంటే భారత పిచ్‌లపై ప్రత్యర్థి జట్ల బౌలర్లకు పెద్ద సమస్యగా మారవచ్చు. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 5న న్యూజిలాండ్‌తో ఆడనుంది.

డేవిడ్ మలన్ సెంచరీ..

ఇరు జట్లు:

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w/c), గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, బెన్ లిస్టర్.

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..