AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇలాంటి రీజన్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. రద్దైన అంతర్జాతీయ మ్యాచ్.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్.. వీడియో

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన యాషెస్ మూడో టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు.. పిచ్‌పై వేసిన కవర్‌ను తొలగించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

Watch Video: ఇలాంటి రీజన్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. రద్దైన అంతర్జాతీయ మ్యాచ్..  ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్.. వీడియో
England Vs Australia 1975 Ashes Test
Venkata Chari
|

Updated on: Aug 19, 2022 | 12:28 PM

Share

క్రికెట్‌లో ఇలాంటి ఘటన ఒకటి జరిగిందని చాలామందికి తెలియదు. ఈ వీడియోను చూసి ఎవరూ నమ్మలేకపోయారు. నేటికీ ఇది చదివినా, చెప్పుకున్నా అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. క్రికెట్ చరిత్రలో పిచ్‌ని టార్గెట్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. అసలు ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆతిథ్య ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ టెస్టు సిరీస్‌ జరుగుతుండగా, ఆ మ్యాచ్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. అవును.. నమ్మడానికి కొంచెం లేటు పట్టినా.. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ఘటనను తలచుకుని క్రీడా ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.

ప్రస్తుత కాలంలో క్రికెట్ మైదానం లోపలా, బయటా ఎంతో భద్రత ఉంటుంది. అయితే చాలా ఏళ్ల క్రితం ఇలాంటి సెక్యూరిటీ లేదు. అందుకే ఇలాంటి ఘనట చోటు చేసుకుంది. అచ్చంగా చెప్పాలంటే ముంబైలో పాక్ క్రికెటర్లు ఆడుతున్నందుకు నిరసనగా వాంఖడే స్టేడియంలో శివసేన కార్యకర్తలు పిచ్ తవ్వడం అందరికీ గుర్తుండే ఉంటుంది. 47 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే 19 ఆగస్టు 1975న ఇంగ్లండ్‌లోని ప్రసిద్ధ హెడింగ్లీ మైదానంలో ఇలాంటిదే జరిగింది.

యాషెస్ మధ్యలో హెడ్డింగ్లీ పిచ్‌పై దాడి..

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌లో భాగంగా హెడింగ్లీ వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. నాలుగు రోజుల మ్యాచ్‌ పూర్తయింది. విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో 445 పరుగులు చేయాల్సి ఉండగా, నాలుగో రోజు సమయానికి 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రిక్ మెక్‌కోస్కర్ 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఆ తర్వాత ఆగస్ట్ 19 తేదీ వచ్చింది. అది మ్యాచ్ చివరి రోజు. ఆటగాళ్లు మ్యాచ్‌కు సిద్ధమవుతుండగా, గ్రౌండ్స్‌మెన్‌, ఇతర అధికారులు మ్యాచ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

హెడింగ్లీ గ్రౌండ్‌లోని సిబ్బందిలో ఒకరు పిచ్‌పై వచ్చి కవర్‌ను తీయగానే, అతను అవాక్కయ్యాడు. ఒక రోజు ముందు సురక్షితంగా ఉన్న పిచ్, తవ్వినట్లు కనిపించింది. అంతే కాదు ఆ గొయ్యి, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక లీటర్ల నూనె పోసి ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ఇయాన్ చాప్‌మన్, ఇంగ్లండ్ కెప్టెన్ టోనీ గ్రెగ్‌లకు సమాచారం అందించిన గ్రౌండ్స్‌మెన్ అధికారులకు అసలు విషయం తెలియజేశాడు. మ్యాచ్‌ను రద్దు చేసేందుకు ఇద్దరు కెప్టెన్లు అంగీకరించారు.

ఈ చర్య ఎవరు, ఎందుకు చేశారు?

అసలు ప్రశ్న ఇది ఎందుకు జరిగింది? దీని వెనుక కారణం ఏంటి? అసలు కారణం తెలిస్తే నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి కారణం అరుదుగా జరిగి ఉంటుంది. వాస్తవానికి, ఈ సంఘటనకు ఒక సంవత్సరం ముందు, ఇంగ్లాండ్‌లోని 34 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ జార్జ్ డేవిస్‌కు లండన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కార్యాలయంలో సాయుధ దోపిడీకి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే డేవిస్‌ను తప్పుడు కేసులో ఇరికించారని, పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయలేదని, సాక్ష్యాలను దాచిపెట్టారని డేవిస్ సన్నిహితులు ఆరోపించారు. దాదాపు ఒక సంవత్సరం పాటు, డేవిస్ మద్దతుదారులు అతని స్వేచ్ఛ కోసం నిరసనలు చేశారు. చివరకు, 1975లో టెస్ట్ మ్యాచ్ నాల్గవ రోజు రాత్రి మైదానంలోకి ప్రవేశించిన నిరసనకారులు, పిచ్‌పై గుంతలు తవ్వేశారు.

ఆ రోజు, సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత గ్రౌండ్స్‌మన్ పోలీసులను పిలిచాడు. హెడింగ్లీ గోడలపై రాసిన నినాదాల నుంచి డేవిస్ మద్దతుదారులు ఈ సంఘటన వెనుక ఉన్నట్లు కనుగొన్నారు. వీటిలో తెలుపు రంగులో – ‘ఫ్రీ జార్జ్ డేవిస్, ‘జార్జ్ డేవిస్ నిర్దోషి’ అని రాశారు. డేవిస్ చివరకు 1976లో విడుదలయ్యాడు. డేవిస్‌ను తప్పుగా ఇరికించారని UK హోం సెక్రటరీ అంగీకరించారు. అయితే దీని తరువాత డేవిస్ తరువాతి సంవత్సరాలలో వివిధ దోపిడీ కేసులలో మళ్లీ చాలా సంవత్సరాలు జైలులో ఉన్నాడు.