- Telugu News Photo Gallery Cricket photos England bowler james anderson first fast bowler in world and break 110 years old record in 40 years age sachin also telugu cricket news
Cricket: 110 ఏళ్ల చరిత్రకు బీటలు.. ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డ్.. లిస్టులో సచిన్ కూడా..
ఒక వికెట్ తీసుకున్న వెంటనే 110 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. రెండు జట్ల మధ్య ఇక్కడ మూడు టెస్టుల సిరీస్ జరుగుతోంది.
Updated on: Aug 19, 2022 | 12:39 PM

James Anderson: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వయసు 40 ఏళ్లు. కానీ, అతని ఫిట్‌నెస్, చురుకుదనం మాత్రం యువ ప్లేయర్లకు ఏమాత్రం తీసిపోదు. ప్రస్తుతం ఈ ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతున్నాడు. ఈ సమయంలో, అతను ఒక వికెట్ తీసుకున్న వెంటనే 110 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. రెండు జట్ల మధ్య ఇక్కడ మూడు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఆగస్టు 17 నుంచి లార్డ్స్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇందులో అండర్సన్ మ్యాచ్ రెండో రోజు ఒక వికెట్ తీశాడు.

సౌతాఫ్రికా ఓపెనర్, కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను అండర్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తద్వారా 40 ఏళ్ల వయసులో టెస్టు వికెట్ తీసిన ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు. టెస్టు వికెట్ తీసిన అతి పెద్ద ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడని చెప్పొచ్చు. ఇప్పటి వరకు క్రికెట్ ప్రపంచంలో ఏ బౌలర్ కూడా 40 ఏళ్ల వయసులో వికెట్ తీయలేకపోయాడు.

అంతకుముందు, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ సిడ్నీ బర్న్స్ పేరిట ఈ రికార్డు నమోదైంది. 39 ఏళ్ల 52 రోజుల వయసులో వికెట్ తీశాడు. బార్న్స్ 110 ఏళ్ల క్రితం అంటే 1912లో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం జేమ్స్ ఆండర్సన్ వయసు 40 ఏళ్ల 19 రోజులు. అతను ఇటీవల జులై 30 నాటికి 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

భారత గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, శ్రీలంకకు చెందిన రంగనా హెరాత్ 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సులో టెస్ట్ వికెట్లు తీసిన ఘనత సాధించారు. అయితే వీరిద్దరూ దిగ్గజ స్పిన్ బౌలర్లు అన్నది ఇక్కడ గమనించాలి. కాగా, 40 ఏళ్ల వయసులో వికెట్ తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ నిలిచాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు జిమ్మీ 18 ఓవర్లలో 51 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 658 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు.

ఇక లార్డ్స్ టెస్టులో భాగంగా గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది.




