Ben Stokes Retires: టీమిండియా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. వన్డేల నుంచి తప్పుకున్న స్టార్ ఆల్ రౌండర్..
గత నెలలో స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్ అయిన వెంటనే న్యూజిలాండ్, భారత్‌పై వరుసగా టెస్ట్ మ్యాచ్‌లను గెలుచి, నూతనోత్సాహంతో దూసుకపోతోంది.
ఇంగ్లండ్ సూపర్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes) వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. స్టోక్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నేడు వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించి, షాక్ ఇచ్చాడు. జులై 19 మంగళవారం జరిగే దక్షిణాఫ్రికా (England vs South Africa)తో జరిగే తొలి వన్డే.. తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని స్టోక్స్ తెలిపాడు. ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మొదటి మ్యాచ్ డర్హామ్‌లో జరగనుంది. ఈ విధంగా స్టోక్స్ తన సొంత మైదానం నుంచి వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.
31 సంవత్సరాల వయస్సులో ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొదటిసారిగా ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా చేసిన ఫార్మాట్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మూడేళ్ల క్రితం, జులై నెలలోనే, లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో స్టోక్స్ 84 పరుగులతో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. దాని ఆధారంగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరుకుంది. సూపర్ ఓవర్ కూడా టై అయినప్పటికీ, ఎక్కువ బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా ప్రకటించారు. స్టోక్స్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
తాజాగా ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా నియమితులైన స్టోక్స్.. తన నిర్ణయాన్ని సుదీర్ఘ ప్రకటనలో వివరించడంతో పాటు దానికి కారణాన్ని కూడా వివరించడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. స్టోక్స్ మాట్లాడుతూ, “నేను మంగళవారం డర్హామ్‌లో ఇంగ్లాండ్ తరపున వన్డే క్రికెట్‌లో నా చివరి మ్యాచ్ ఆడతాను. నేను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది. నా సహచరులతో కలిసి ఇంగ్లండ్‌తో ఆడిన ప్రతి నిమిషం ఆనందించాను. మా ప్రయాణం చాలా చిరస్మరణీయమైనది” అంటూ రాసుకొచ్చాడు.
❤️??????? pic.twitter.com/xTS5oNfN2j
— Ben Stokes (@benstokes38) July 18, 2022
స్టోక్స్ తన ప్రకటనలో, “ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. అయితే ఈ ఫార్మాట్‌లో నేను ఇకపై నా సహచరులకు, ఇంగ్లండ్‌కు 100 శాతం ఇవ్వలేను అనే వాస్తవాన్ని ఎదుర్కోవడం కంటే కష్టం కాదు. మూడు ఫార్మాట్‌లు ఇప్పుడు నాకు చాలా ఎక్కువ. షెడ్యూల్, మాపై ఉంచిన అంచనాల కారణంగా నా శరీరం నాకు మద్దతు ఇవ్వకపోవడమే” అంటూ పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..